దగ్గుపాటి రాణా ఇక 'లీడర్'

By Staff

Rana
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు రాణా ఇక లీడర్ అవతారం ఎత్తనున్నారని తెలుస్తోంది. యువదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రంకి లీడర్ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో రాణా పోషించే పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటుందని, చాలా న్యాచురల్ గా రాణా పోషిస్తున్నాడని వినపడుతోంది. ఇక ఈ చిత్రం కోసం నానక్ రామ్ గూడా రామానాయుడు సినీ విలేజ్ లో అసెంబ్లీ సెట్ వేసి కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

దీనిని బట్టి ఈ చిత్రం రాజకీయం బ్యాక్ డ్రాప్ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇక యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే మెసేజ్ తో ఈ చిత్రం రూపొందుతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆనందతాండవం లో హీరోయిన్ గా చేస్తున్న రుక్మిణి చేస్తోంది. సంగీతాన్ని మిక్కీజే మేయర్ అందిస్తున్నాడు. హ్యాపీడేస్ లాగ ఈ చిత్రం కూడా ఓ సంచలనమవుతుందని అందరూ ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి కొన్ని సన్నివేశాలు శేఖర్ సంతృప్తి చెందక రీషూట్ చేసారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X