twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘లీడర్’?

    By Sindhu
    |

    కాలేజీ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు 'హ్యాపిడేస్" గా మలచిన శేఖర్ కమ్ముల నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో 'లీడర్" చిత్రంలో చెప్పనున్నాడు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా 'లీడర్" కథను మలచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను ఒక ఆదర్శనేతగా తీసుకుని కథ అల్లినట్లు తెలుస్తోంది. సినిమా పూర్తయిన తర్వాత అందులోని సన్నివేశాలు వాస్తవంగా జరగడంతో సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంవుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. డి.రామానాయుడు మనవడు సురేష్ బాబు కుమారుడు రానా హీరోగా రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లాంఛ్ చేసిన చిత్రమిది. ఇప్పటికే 'లీడర్" చిత్రానికి పబ్లిసిటి షురూ అయింది. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన 'లీడర్" తొలి ట్రయిలర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'షాడో ఇమేజ్" లో ఈ ట్రైయిలర్ రిలీజైంది. ప్రతిష్టాత్మక ఎ.వి.యం సంస్థ. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరున విడుదల చేయుటకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, సుహాసిని మణిరత్నం, రావ్ రమేష్ లు ప్రదానా పాత్రల్లో నటిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X