twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ :దగ్గుపాటి రానా సరసన సమంత

    By Srikanya
    |

    హైదరాబాద్ :సిద్ధార్థ్‌, హన్సిక జంటగా నటించిన చిత్రం 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'. సుందర్‌.సి. దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సమంత, రానా అతిథి పాత్రల్లో తళుక్కున మెరిస్తునట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇప్పటికే వీరిపై సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలో పాటల్నీ, వచ్చే నెలలో చిత్రాన్నీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లోఈ చిత్రం తెరకెక్కుతోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌... అంటూ ఓ పాట పాడుకొన్నాడు సిద్ధార్థ్‌. ఇప్పుడు ఆ పాటనే తన సినిమాకి పేరుగా మార్చుకొన్నాడు.

    సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ''నేను నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌... పాటంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటనే నా సినిమాకి పేరుగా నిర్ణయించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లాంటి కథానాయకులతో సినిమాలు తీసిన దర్శకుడు సుందర్‌.సి. ఆయన తెలుగులో తొలి సినిమా చేస్తుండడం, అందులో నేను నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నాతో పాటు బ్రహ్మానందం కూడా ఓ హీరోనే. ఆయనతో నేను కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి''అన్నారు.

    ''దేనికైనా రెడీ' తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న నా చిత్రమిదే. 'ఓ మై ఫ్రెండ్‌' తర్వాత సిద్ధార్థ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది''అన్నారు హన్సిక. దర్శకుడు మాట్లాడుతూ ''తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకొంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ప్రేమ, వినోదం, కుటుంబ అనుబంధాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బ్రహ్మానందం ప్రేమ్‌జీ అనే లవ్‌గురు పాత్రలో కనిపిస్తారు. ఆయన దగ్గర సిద్ధార్థ్‌ ప్రేమ పాఠాలు నేర్చుకొనే విధానం వినోదం పంచుతుంది''అన్నారు.

    ప్రస్తుతం రానా...ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బహుబలి'లో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

    English summary
    Siddharth, Hansika are starring in the romantic entertainer ‘Something Something’ in C.Sunder direction. According to sources RaNa will be seen in a cameo and filmmakers already shot those scenes on RaNa and Siddharth. Plans are on to release the film next month after audio launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X