'కృష్ణం వందే జగద్గురుం' భారీ రిలీజ్ ..వివరాలు

By Srikanya

హైదరాబాద్ : దగ్గుపాటి రానా తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. దాదాపు వెయ్యి థియోడటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా సినిమాల్లో ఇదే భారీ రిలీజ్. ఈ చిత్రంలో రానా సురభీ నాటక కళాకారుడుగా కనిపిస్తాడు. సురభి నాటక కళాకారుడైన బీటెక్ బాబుకు కోపం ఎందుకొచ్చింది అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని చెప్తున్నారు. అలాగే రానా అభిమానులు పండుగ చేసుకునేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు క్రిష్ చెప్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 30న విడుదల అవుతోంది.

ఈ చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ....గతంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్నంతటినీ కబ్జా చేశాడు. దాంతో దేవుడు వరాహునిగా అవతరించి వాడ్ని చంపాడు. ఇప్పుడు వాడ్ని మించిన భూబకాసురులు సందుకొకళ్లు. అంటే మళ్లీ దేవుడి ఎంట్రీ అవసరం. సంభవామి యుగే యుగే... అని గీత సాక్షిగా మాటిచ్చేశాడు కాబట్టి తప్పక
వస్తాడు. అయితే ఎలా వస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానమే 'కృష్ణంవందే జగద్గురుమ్' అన్నారు.

ఈ చిత్రం లో క్యారెక్టర్ గురించి హీరో రాణా మాట్లాడుతూ...నా పేరు బాబు. చదువు బీటెక్‌. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రాణా. ఈ చిత్రంలో రానా పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రను నయనతార పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

బ్రహ్మానందం, మిలింద్ గునాజీ, నాగినీడు, 'సత్యం'రాజేష్, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, నిర్మాణం: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X