చరణ్ కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన రాణా..!
ఇటీవల రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ ఉపాసనతో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్ళి తేదీ ఇంకా ప్రకటించలేదు గానీ..రెండు కుటుంబాలు పెళ్ళికి సంబంధించిన చర్చలు ముమ్మరంగా జరుపుతున్నారని వినికిడి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన రాణా ఓ గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసాడట. ఈ పార్టీ చరణ్ కోసం అరేంజ్ చేసాడని తెలుస్తోంది. ఇది బ్యాచులర్ పార్టీ అని సమాచారం.
ఈ వీకెండ్ లో జరుగుతున్న పార్టీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రానా దగ్గరుండి చూసుకున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం డిపార్ట్ మెంట్ షూటింగ్ లో బిజీగా ఉన్న రాణా ముంబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడట. దాదాపు 15మంది క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా 40మంది స్టార్స్ ఈ పార్టీలో పాల్గొంటున్నారని వినికిడి. వీకెండ్ లో ఆరంభమయ్యే ఈ పార్టీ సోమవారం తెల్లవారే వరకూ జరుగుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రికరణలో బిజీగా ఉన్నారు. ఆ తరువాతే వివాహ ముహూర్తాన్ని ఖరారు చేస్తారని సమాచారం. పిభ్రవరి చివరిలోగానీ మార్చిలోగాని ముహుర్తం కుదిరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











