వెంకీ మామ విషయంలో సురేష్ బాబు అంచనా తప్పిందా.? అందుకే అది తీసుకున్నారా.?

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. డీ రామానాయుడు స్థాపించిన ఈ సంస్థలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. టాలెంట్‌ను వెలికి తీయడంలో ముందుండే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది దర్శకులు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి రికార్డులకెక్కింది. రామానాయుడు తర్వాత ఆయన కుమారుడు సురేష్ బాబు కూడా ఈ సంస్థను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. అయితే, తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఫెయిల్ అయిందని ఇండస్ట్రీలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు..?

ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు

ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ'. కేఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ సినిమా వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా కనిపించింది. థమన్ సంగీతం అందించాడు. రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన ఇద్దరు కలవడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీశారు.

భారీ అంచనాలతో వచ్చి.. ఇలా అయింది

భారీ అంచనాలతో వచ్చి.. ఇలా అయింది

ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం ‘వెంకీ మామ' విడుదలైంది. చిత్ర యూనిట్ మొదటి నుంచీ చెబుతున్నట్లు ఈ సినిమాలో కామెడీతో పాటు బలమైన ఎమోషన్ కూడా ఉంది. దాన్ని పలికించడంలో వెంకీ, చైతూ ఇద్దరూ సక్సెస్ అయ్యారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు బడా హీరోలను డైరెక్టర్ డీల్ చేసిన విధానానికి కూడా మంచి మార్కులే పడ్డాయి.

కలెక్షన్ల వర్షం కురుస్తోంది

కలెక్షన్ల వర్షం కురుస్తోంది

మొదట్లో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ, క్రమ క్రమంగా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అదే సమయంలో కలెక్షన్లను కూడా భారీగా రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఇక, ఫస్ట్ వీకెండ్ అంటే మూడు రోజులకు రూ. 45 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

సురేష్ బాబు అంచనా తప్పిందా.?

సురేష్ బాబు అంచనా తప్పిందా.?

‘వెంకీ మామ' సినిమా విషయంలో నిర్మాత సురేష్ బాబు అంచనా తప్పినట్లు ఉందని తాజాగా ఓ చర్చ తెరపైకి వచ్చింది. ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని ఆయన ఊహించి ఉండరనేదే ఆ చర్చ సారాంశం. దీనికి కారణం ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో చాలా వరకు వచ్చే శుక్రవారం నాటికి వేరే సినిమాకు కేటాయించాల్సి రావడమే.

దాన్ని తీసుకున్నది వీళ్లే

దాన్ని తీసుకున్నది వీళ్లే

సల్మాన్ కొత్త చిత్రం ‘దబాంగ్ 3'ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు వెర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసమే వెంకీ మామ ఆడుతున్న థియేటర్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X