జగన్ స్పందిచాలే గానీ రెక్కలు కట్టుకొని వాలిపోతాం.. దగ్గుబాటి సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు
Recommended Video
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రికార్డు స్థాయిలో సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి పీఠంపై హుందాగా కూర్చున్నారు వైఎస్ జగన్. యువ ముఖ్యమంత్రి కావడంతో పరిపాలన పరంగా తీసుకునే నిర్ణయాలు సృజనాత్మకంగా ఉంటాయని భావిస్తోంది రాష్ట్ర ప్రజానీకం. ఈ నేపథ్యంలో జగన్ పాలనా సౌలభ్యలను దృష్టిలో పెట్టుకొని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దగ్గుబాటి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి పోతే..

నిర్మాణ సంస్థలన్నీ హైదరాబాద్ లోనే
మద్రాసు నుంచి తెలుగు సినిమా పరిశ్రమ వేరయ్యాక సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ లోనే సెటిల్ అయింది. రామానాయుడు స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్ లాంటి బడా బడా నిర్మాణ సంస్థలన్నీ ఇక్కడే నిర్మించబడటంతో తెలుగు సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్‌గా మారిపోయింది హైదరాబాద్.

సురేష్ ప్రొడక్షన్స్ విషయానికొస్తే
దేశంలోని నిర్మాణ సంస్థల్లోకెల్లా దివంగత దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్‌కి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తన కొడుకు సురేష్ బాబు పేరు మీదుగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభించిన రామానాయుడు.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఆయన బ్రతికున్న కాలంలో హైదరాబాద్ తో పాటుగా వైజాగ్‌లో కూడా ఎక్కువగా షూటింగ్స్ జరిపేవారు రామానాయుడు.

రాష్ట్రం విడిపోవడం కారణంగా
ఈ లోగా 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, నవ్యాంద్ర అనే రెండు రాష్ట్రాలుగా విడిపోవడం కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కార్య కలాపాలన్నీ హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబందించిన కొన్ని కార్యక్రమాలైనా నవ్యాంద్ర వేదికగా జరగాలనే డిమాండ్స్ రావడం జరిగింది. అయితే గత ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై పెద్దగా శ్రద్ద పెట్టకపోవడంతో ఆ డిమాండ్స్ పరిగణలోకి రాలేదు.

జగన్ స్పందిచాలే గానీ
అయితే ఇప్పుడు యువ ముఖ్యమంత్రిగా జగన్ చేతికి అధికారాలు రావడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే దీనిపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్పందించిన దగ్గుబాటి సురేష్ బాబు.. వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించడానికి సినీ ఇండస్ట్రీ సుముఖంగా ఉందని చెప్పారు. ఈ అంశంపై జగన్ స్పందించి ప్రభుత్వ నిర్ణయాన్ని చెబితే స్టూడియోల నిర్మాణం జరగడం పెద్ద విషయం కాదని ఆయన తేల్చేశారు.

ఇకపై బిజినెస్ బాగా విస్తరిస్తాం
ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోస్ బిజినెస్ కార్యకలాపాలను మున్ముందు బాగా విస్తరిస్తామని సురేష్ బాబు పేర్కొన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా నిర్మించడానికి తెలుగు నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కోవలోనే ప్రస్తుతం వాల్ సిడ్నీ సంస్థతో కలిసి భారీ ప్రాజెక్టు 'హిరణ్యకశ్యప' చేస్తున్నామని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











