twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినారె మరణం సాహితీ లోకానికి తీరని లోటు: వెంకటేష్

    నటుడు వెంకటేష్ సినారె ఇంటికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

    |

    హైదరాబాద్: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సి.నారాయణ రెడ్డి మరణంతో తెలుగు సినీ, సాహితీ ప్రపంచంలో విషాదం నెలకొంది. సినారె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించడానికి పుప్పాలగూడలోని ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

    తెలుగు నటుడు వెంకటేష్ మంగళవారం ఉదయం సినారె ఇంటికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినారె తమ ఫ్యామిలీ ప్రెండ్ అని, తన తండ్రి డా. డి రామానాయడు గారికి అత్యంత సన్నిహితులని తెలిపారు.

    సాహితీ లోకానికి తీరని లోటు

    సాహితీ లోకానికి తీరని లోటు

    గొప్ప సాహితీ వేత్త అయిన సినారే మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని వెంకటేష్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

    ప్రముఖుల నివాళి

    ప్రముఖుల నివాళి

    సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సి నారాయణరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, హాస్య నటుడు బ్రహ్మానందం, గీతరచయిత సుద్దాల అశోక్ తేజ, మాటలరచయిత పరిచూరి గోపాలకృష్ణ తదితరులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

    సినారె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం!

    సినారె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం!

    మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

    సినారే షరతులు.. ఎన్టీఆర్ ఒప్పుకోక తప్పలేదట.. సీతయ్య ఎవరీ మాట వినడు..

    సినారే షరతులు.. ఎన్టీఆర్ ఒప్పుకోక తప్పలేదట.. సీతయ్య ఎవరీ మాట వినడు..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    TOLLYWOOD actor Daggubati Venkatesh Condolences to C Narayana Reddy(Cinare).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X