For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Narappa Success Meetలో నోరు జారిన వెంకటేష్: ప్రకటనకు ముందే లీక్.. సాహసం చేస్తున్నారుగా!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడం వల్ల ఇలాంటి సినిమాలను స్వాగతిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ఎఫ్3' మూవీ ఒకటి. తాజాగా ఈ సినిమా గురించి 'నారప్ప' సక్సెస్‌ మీట్‌లో నోరు జారారు హీరో వెంకటేష్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ‘నారప్ప’ అంటూ వచ్చిన వెంకటేష్

  ‘నారప్ప’ అంటూ వచ్చిన వెంకటేష్

  విక్టరీ వెంకటేష్ - శ్రీకాంత్ అడ్డాల కలయికలో వచ్చిన చిత్రం ‘నారప్ప'. తమిళంలో ధనూష్ హీరోగా రూపొందిన ‘అసురన్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెట్, వీ క్రియేషన్స్‌ పతాకాలపై డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

  ఫిజిక్ విషయంలో అనసూయ డేరింగ్ స్టెప్: విమానం ఎక్కేందుకు రిస్క్.. దీని వెనుక అసలు కథ తెలిస్తే!

  ఓటీటీలో విడుదల.. భారీ రెస్పాన్స్

  ఓటీటీలో విడుదల.. భారీ రెస్పాన్స్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘నారప్ప' మూవీ జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి క్లిక్కులు కూడా చాలానే వచ్చాయి. అలాగే, రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. ఈ చిత్రంతో నటుడిగా వెంకీకి సైతం ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి.

  ఫ్యాన్స్ నిరాశ... అక్కడ పోస్టులతో

  ఫ్యాన్స్ నిరాశ... అక్కడ పోస్టులతో

  టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన సినిమాను థియేటర్లలో కేకల మధ్య చూడాలని ప్రతి అభిమానీ కోరుకుంటాడు. అలాంటి మంచి మాస్ మసాలా సినిమా వస్తే వాళ్ల అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పక్కర్లేదు. అలాంటి చిత్రమే ‘నారప్ప'. దీన్ని ఓటీటీలో విడుదల చేయడంపై ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. దీనిపై పోస్టులు పెడుతున్నారు.

  సక్సెస్‌ మీట్‌లో ఎమోషనల్‌ స్పీచ్

  సక్సెస్‌ మీట్‌లో ఎమోషనల్‌ స్పీచ్

  శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ‘నారప్ప' సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఇందులో హీరో వెంకటేష్, ప్రియమణి, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో సహా మిగిలిన వాళ్లంతా పాల్గొన్నారు. ఇక, ఈ ఈవెంట్‌లో వెంకటేష్ ఎమోషనల్‌గా మాట్లాడారు. సుదీర్ఘమైన కెరీర్‌లో తాను చేసిన సినిమాలు, పాత్రల్లో ఇది చాలా ప్రత్యేకం అని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

  ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన వెంకీ

  ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన వెంకీ

  ‘నారప్ప' సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘నారప్పను ఓటీటీలో విడుదల చేయడంపై నా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారని తెలుసు. మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. ఓటీటీలో కూడా నా సినిమాను సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమాను ఆదరించినందుకు సంతోషంగా ఉంది' అంటూ ఆయన పేర్కొన్నారు.

  లేటు వయసులో ఘాటు ఫొటోలతో షాకిచ్చిన ప్రియమణి: ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
  సక్సెస్‌ మీట్‌లో నోరు జారిన వెంకీ

  సక్సెస్‌ మీట్‌లో నోరు జారిన వెంకీ


  ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరిచే క్రమంలో ‘నారప్ప' సక్సెస్‌ మీట్‌లో వెంకటేష్ నోరు జారారు. ‘నారప్పను ఓటీటీలో విడుదల చేసినందుకు సారీ. ఎఫ్3ని మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నాం. పండుగ సీజన్‌లో ఫన్‌ను పంచుతున్నాం. అది మామూలుగా ఉండదు' అంటూ చెప్పుకొచ్చారు. తద్వారా ప్రకటనకు ముందే ‘ఎఫ్3' సినిమా రిలీజ్‌ను లీక్ చేశారు. ఇక, ఇది భారీ చిత్రాలతో పోటీ పడనుంది.

  English summary
  Daggubati Venkatesh, Varun Tej Doing F3 under Anil Ravipudi Direction. Recently Narappa Unit Cunduct Success Meet. Venkatesh Leaked F3 Movie Release Date in an Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X