For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Drushyam 2: వెంకటేష్‌కు భారీ షాక్.. రిలీజైన గంటల్లోనే ఫుల్ మూవీ లీక్.. ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్

  |

  కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్. విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన.. ప్రయోగాత్మక చిత్రాలతో సక్సెస్‌లను అందుకుంటున్నాడు. రీమేక్ మూవీలకు పెట్టింది పేరుగా నిలుస్తోన్న ఈ సీనియర్ హీరో.. వరుసగా అదే తరహా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

  ఈ ఏడాది ఇప్పటికే 'నారప్ప' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్.. ఇప్పుడు 'దృశ్యం 2' అనే చిత్రంతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే, విడుదలైన గంటల్లోనే ఫుల్ మూవీ లీక్ అవడంతో చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  వరుస విజయాలతో వెంకీ దూకుడు

  వరుస విజయాలతో వెంకీ దూకుడు

  ఈ మధ్య కాలంలో విక్టరీ వెంకటేష్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘గురు' మూవీ నుంచి వరుసగా ‘F2', ‘వెంకీ మామ', ‘నారప్ప' వంటి హిట్లను అందుకున్నారు. ఇందులో ‘నారప్ప' ఓటీటీలో నేరుగా విడుదలైంది. దీనిపై వెంకటేష్ అభిమానులు నిరాశ చెందారు. ఇక, ఇప్పుడు ఆయన ‘F3' మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

   ‘దృశ్యం 2' అంటూ వచ్చేశాడుగా

  ‘దృశ్యం 2' అంటూ వచ్చేశాడుగా

  టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రమే ‘దృశ్యం 2'. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు. మీనా ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కృతిక, ఎస్తర్ అనిల్, నదియా, సంపత్, నరేష్, తణికెళ్ల భరణిలు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

  చెప్పిన దానికంటే ముందే విడుదల

  చెప్పిన దానికంటే ముందే విడుదల

  మలయాళంలో ‘దృశ్యం 2' సూపర్ హిట్ అయింది. దీంతో దీన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఇక, ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీన్ని నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 24 రాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ ప్రారంభం అయిపోయింది.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  సూపర్ హిట్ టాక్... పాజిటివ్ రివ్యూ

  సూపర్ హిట్ టాక్... పాజిటివ్ రివ్యూ

  వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2' మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014లో వచ్చిన ‘ద‌ృశ్యం' మూవీకి ఇది సీక్వెల్‌గా వచ్చింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు వెంకీ అభిమానులు ఖుషీగా ఉన్నారు.

   రిలీజ్ అయిన గంటల్లోనే మూవీ లీక్

  రిలీజ్ అయిన గంటల్లోనే మూవీ లీక్


  ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పైరసీ భూతం ఇండస్ట్రీని మరింతగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన వెంకటేష్ ‘దృశ్యం 2' మూవీ కూడా విడుదలైన రోజే లీకైపోయింది. ఈ సినిమా డౌన్‌లోడ్ లింక్స్ కూడా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అవడంతో యూనిట్‌కు భారీ షాక్ తగిలినట్లైంది.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  ఆ సైట్లలో ‘దృశ్యం 2' మూవీ లింక్

  ఆ సైట్లలో ‘దృశ్యం 2' మూవీ లింక్

  చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘దృశ్యం 2' మూవీని కూడా లీక్ చేసేశాయి. స్ట్రీమింగ్‌కు వచ్చిన గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయి. దీని ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉంది. దీంతో అమెజాన్ సంస్థ ఆందోళన చెందుతోంది.

  Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu
   ఆ సినిమాలు కూడా లీక్ అయ్యాయి

  ఆ సినిమాలు కూడా లీక్ అయ్యాయి

  గతంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు పైరసీ కావడానికి ఒకరోజైనా సమయం పట్టేది. అయితే, ఓటీటీలో నేరుగా విడుదలయ్యే చిత్రాలు మాత్రం గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన ‘నారప్ప', ‘టక్ జగదీష్' సహా ఎన్నో సినిమాలు లీక్ అయ్యాయి. దీంతో ఆయా ఓటీటీ సంస్థలు చాలా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

  English summary
  Daggubati Venkatesh Did Drushyam 2 Movie Under Jeethu Joseph Direction. Now This Movie Leaked Online For Free Download
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X