జోరుమీదున్న నారప్ప.. హైదరాబాద్ చేరిన వెంకీ బృందం.. కరోనా కారణంగా!
విక్టరీ వెంకటేష్ 'నారప్ప'గా కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా.. షూటింగ్ పరంగా సూపర్ జోష్ కొనసాగిస్తున్నారు వెంకటేష్. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్.. తిరిగి హైదరాబాద్ చేరుకుంది.
మొదటి షెడ్యూల్‌లో భాగంగా తమిళనాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నిజానికి ఈ షూట్‌లో కొంతభాగం అనంతపురంలో జరగాల్సి ఉండగా, అక్కడ జనసందోహం ఎక్కువగా ఉండి కొన్ని సమస్యలు తలెత్తడంతో దానిని తమిళనాడులో ఫినిష్ చేశారు. మొత్తానికి విజయవంతంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

తమిళనాడు నుంచి హైదరాబాద్ చేరుకున్న 'నారప్ప' యూనిట్.. కరోనా కారణంగా తదుపరి షెడ్యూల్ వాయిదా వేసుకుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతే
నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. తమిళంలో సూపర్ హిట్ అయిన 'అసురన్' సినిమాకు రీమేక్ గా రాబోతున్నఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి, రెబా జాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం వెంకీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











