వెంకటేష్ పుట్టిన రోజు కానుక.. 'వెంకీమామ' సర్‌ప్రైజ్ అదిరింది

రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'వెంకీమామ'. డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగచైతన్య రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాలో సన్నివేశాలు పొందుపర్చారని సమాచారం.

చిత్రంలో రైతు పాత్రలో వెంకటేష్ నటించగా, నాగ చైతన్య జవాన్ పాత్రలో నటించాడు. రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు రీల్ లైఫ్ మామాఅల్లుళ్లుగా మారుతున్న నేపథ్యంలో ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించింది చిత్రయూనిట్.

ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించిన యూనిట్ సభ్యులు.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంలో డిసెంబర్‌ 20న రిలీజ్ చేద్దామని సన్నాహాలు చేశారు. ఆ డేట్‌లో కూడా మూడు సినిమాలు పోటీకి ఉండటంతో తాజాగా ఈ సినిమాకు డిసెంబర్ 13 ముహూర్తం పెట్టేశారు. డిసెంబర్ 13 వ తేదీన 'వెంకీమామ' సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇదే రోజు వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ రానా, దర్శకుడు బాబీ ఒక వీడియోను పోస్ట్ చేశారు.

Daggubati Venkateshs Venky Mama Release date fixed

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఒక్కో అప్‌డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X