‘మహానాయకుడు’పై ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన కామెంట్!

మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన చిత్రాల లిస్టులో ఇది చేరిపోయింది.

మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు'కు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందినప్పటికీ... రెండో భాగం 'మహానాయకుడు' మాత్రం విమర్శల పాలైంది. కేవలం చంద్రబాబు నాయుడుకు ఫేవర్‌గా ఈ సినిమా తీసినట్లు ఉందనే అభిప్రాయాలు చాలా మంది నుంచి వ్యక్తం అయ్యాయి.

కాగా.. ఎన్టీఆర్ బయోపిక్‌పై ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్టీఆర్-కథానాయకుడు'కు న్యాయం చేశారు

‘ఎన్టీఆర్-కథానాయకుడు'కు న్యాయం చేశారు

ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కథానాయకుడు' చూశాను. సినిమా కథ పరంగా పూర్తి న్యాయం చేసినట్లు భావిస్తున్నాను. అయితే ఈ సినిమా ఎందుకు ఆడలేదో అర్థం కాలేదని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.

‘మహానాయకుడు'లో అది నిజం కాదు

‘మహానాయకుడు'లో అది నిజం కాదు

‘మహానాయకుడు' సినిమా చివర్లో... ట్రైన్‌లో ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళుతూ ఉంటే.. వారు వెళ్లకుండా ఎవరో వచ్చి లాక్కపోవడానికి ప్రయత్నించినట్లు చూపించారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఆ సమయంలో నేను ట్రైన్‌లోనే ఉన్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.

ఎవరూ దాడి చేయలేదు

ఎవరూ దాడి చేయలేదు

ఆ రోజు ఏ ఎమ్మెల్యేను ఎవరూ బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరూ వచ్చి ఎటాక్ చేయలేదు. శాసన సభ్యులు వారంతట వారు స్వచ్ఛందంగా వచ్చి రామకృష్ణ స్టూడియోలో ఉన్న తర్వాత వారిని మేమంతా కలిసి రాత్రి పూట నాంపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

నేను చెప్ప కూడని ప్లేసుకు కూడా వెళ్లేవారు

నేను చెప్ప కూడని ప్లేసుకు కూడా వెళ్లేవారు

అపుడు ఎమ్మెల్యేలు సుబ్బరంగా బయటకు వెళ్లేవారు, సినిమాలు చూసేవారు, చక్కగా ఎంజాయ్ చేసేవారు, తిరిగి వచ్చేవారు. వారిని ఎవరూ ఆపేవారు కాదు. ఎమ్మెల్యేలు కేవలం సినిమాలే కాదు నేను చెప్పకూడని ప్లేసుకు కూడా వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవారు. ఇంతకంటే పచ్చిగా ఏమీ చెప్పలేను... అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు.

సినిమాలో చూపించిన సీన్ ఏమిటి?

సినిమాలో చూపించిన సీన్ ఏమిటి?

ఎన్టీ రామారావు గుండె చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదేండ్ల భాస్కర్ రావు కొందరు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని గవర్నరుతో కుమ్మక్కై ముఖ్యమంత్రి అవుతాడు. అయితే తిరిగి ఇండియా వచ్చిన రామారావు తనకు బలం ఉందని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలతో కలిసి ట్రైన్లో రాష్ట్రపతి వద్దకు బయల్దేరే సమయంలో కొందరు వారిని ఢిల్లీ వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసినట్లు, వారిని చంద్రబాబు కాపాడి అందరూ ఢిల్లీ చేరేలా చేసినట్లు చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X