దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం పంచెకట్టులో... (రేర్ ఫోటో)
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత రామానాయుడు ఫ్యామిలీ మొత్తం ఇలా సంప్రదాయబద్దమైన పంచెకట్టులో దర్శనిమిచ్చింది. ఎప్పుడో తీసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్సో లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో ఉన్న వారు లెప్ట్ నుంచి రైట్ కి: డి.సురేష్ బాబు, అభిరామ్, నాగచైతన్య, రామానాయుడు, రాణా, వెంకటేష్. అందరూ ఒకే ఫోజులో(వెంకీ తప్ప), కాలుమీద కాలు వేసుకుని కూర్చుని ఉండటం గమనించే ఉండి ఉంటారు. ముఖ్యంగా వెంకటేష్ ఇదే గెటప్ లో చినరాయుడు వంటి చిత్రాల్లో కనిపించి కనువిందుకూడా చేసారు. వీళ్లలో వెంకటేష్, నాగచైతన్య, రాణా ఇప్పటికే సినీ పరిశ్రమలో హీరోలుగా వచ్చి వెలుగుతున్నవారు.
ఇత వెంకటేష్ విషయానికి వస్తే.. ఆయన హీరోగా రూపొందుతున్న 'షాడో' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీతో పాటు ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.
షాడో' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచంలోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మాఫియా సినిమా అయినంత మాత్రాన సినిమా మొత్తం సీరియస్ సాగదని, కమెడీ టచ్, ఫన్నీ సీన్స్ మెండుగా యాడ్ స్తున్నారని... ఇందుకోసం కోనవెంకట్, గోపీమోహన్‌లు ఆసక్తికరమైన స్క్రిప్టు రూపొందించారని తెలుస్తోంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. మరో వైపు వెంకీ ఈ చిత్రంతో పాటు బోల్ బచ్చన్ రీమేక్ చిత్రం కమిటైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











