RRRకు మరో షాక్.. ఎన్టీఆర్ హీరోయిన్ అవుట్.. కారణమేమిటంటే!
బాహుబలి సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం RRR. అంగరంగ వైభవంగా ప్రారంభమైనప్పటికీ ఈ చిత్రానికి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి బ్రిటన్ అందాల తార డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం సెన్సేషన్‌గా మారింది. RRR నుంచి ఆమె తప్పుకొన్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

రాంచరణ్‌కు గాయంతో వాయిదా
ఇటీవల రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకొన్న తర్వాత RRR సినిమా టీమ్ కథకు సంబంధమున్న వాస్తవ ప్రదేశాల్లో సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఉత్తర భారతానికి వెళ్లారు. కొద్ది రోజులు సవ్యంగా షూట్ జరిగిన తర్వాత రాంచరణ్‌కు గాయం కావడంతో పూణే షూటింగ్‌ను వాయిదా వేశారు.

రాంచరణ్ చీలమండలానికి గాయం
ఉత్తర భారతంలో జరుగుతున్న షూటింగ్ సమయంలో రాంచరణ్ జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో చీల మండలానికి గాయం అయింది. వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో పూణెలో ప్లాన్ చేసిన షెడ్యూల్‌న వాయిదా వేశాం అని బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

RRR మూవీలో నటించడం లేదు
ఇదిలా జరిగితే, ప్రస్తుతం విదేశీ తార డైసీ ఎడ్గర్ జోన్స్ RRR నుంచి తప్పుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి డైసీ ఎడ్డర్ జోన్స్ బయటకు వెళ్లారు. ఈ సినిమాలో ఆమె నటించడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకొంటున్నాం అని టీమ్ RRR సోషల్ మీడియాలో వెల్లడించింది.

బాలనటిగా నుంచి శృంగార తారగా
బ్రిటన్ థియేటర్‌లో డైసీ ఎడ్గర్ జోన్స్ బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. లండన్ నేషనల్ యూత్ థియేటర్ నుంచి రంగస్థలంలో పట్టభద్రులయ్యారు. వార్ ఆఫ్ వరల్డ్స్, పాండ్ లైఫ్, కోల్డ్ ఫీట్ చిత్రాల్లో నటించింది. RRR చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











