For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దళం’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అందాల రాక్షసి చిత్రంలో హీరోగా చేసిన నవీన్ చంద్ర రెండో చిత్రం 'దళం'. ఈ చిత్రంలో నవీన్ చంద్ర నక్సలైట్ గా కనిపించనున్నారు. జీవన రెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయమవుతూ రెడీ అయిన ఈ చిత్రాన్ని జులై మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

    ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈచిత్రం గత సంవత్సరం డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన పియాబాజ్‌పేయ్ నటించింది. జన జీవన స్రవంతిలో కలిసి నక్సలైట్ల జీవితం ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

    చిత్రం కథ గురించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .

    నిర్మాత సుమంత్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది'అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్‌ నర్తించింది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, పియాబాజ్‌పేయ్‌, కిషోర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: సుధాకర్‌ యక్కంటి, సంగీతం: జేమ్స్ వసంతన్‌.

    English summary
    Naveen Chandra, Kishore and Piaa Bajpaai starrer Dalam is finally gearing up for release in the third week of July. Jeevan Reddy is making his debut as a director and M Sumanth Kumar Reddy has produced it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X