నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో 'దళం'.. విడుదల తేదీ

By Srikanya

హైదరాబాద్: అందాల రాక్షసి చిత్రంలో హీరోగా చేసిన నవీన్ చంద్ర రెండో చిత్రం 'దళం'. ఈ చిత్రంలో నవీన్ చంద్ర నక్సలైట్ గా కనిపించనున్నారు. జీవన రెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయమవుతూ రెడీ అయిన ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివర దశలో ఉంది. అలాగే చిత్రంలో నవీన్ చంద్ర సరసన పియాబాజ్‌పేయ్ కనిపించనుంది. ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 1న విడుదల చేస్తారు. జన జీవన స్రవంతిలో కలిసి నక్సలైట్ల జీవితం ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

చిత్రం కథ గురించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .

నిర్మాత సుమంత్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. త్వరలో పాటలు విడుదల చేస్తాము''అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్‌ నర్తించింది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, పియాబాజ్‌పేయ్‌, కిషోర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: సుధాకర్‌ యక్కంటి, సంగీతం: జేమ్స్ వసంతన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X