ఎన్టీఆర్‌ కోసం మరోసారి దలేర్ మెహందీ

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 'బాద్‌షా' కోసం ఓ గీతాన్ని కింగ్‌ ఆఫ్‌ భాంగ్రాగా నిలిచిన గాయకుడు దలేర్‌ మెహందీ ఆలపించారు. 'బంతిపూల జానకీ జానకీ... అంత సిగ్గు దేనికీ దేనికీ...' అని సాగే ఆ గీతాన్ని పాడేందుకు దలేర్‌ మెహందీ రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చారు. రికార్డింగ్‌ థియేటర్‌ 'సింఫనీ'లో ఆయన గీతాన్ని ఆలపించారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, రామజోగయ్యశాస్త్రి ఈ గీతానికి సాహిత్యం అందించారు. గతంలో ఎన్టీఆర్ హిట్ చిత్రం యమదొంగ కోసం.. రబ్బరు గాజులు రబ్బరు గాజులు... అంటూ పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా దలేర్‌ మెహందీ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ సినిమా కోసం రెండోసారి పాడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇది వరకు ఆయన నటించిన 'యమదొంగ'లో పాడాను. అదే నా తొలి తెలుగు పాట. 'రబ్బరు గాజులు రబ్బరు గాజులు'... ఆ పాటను మరచిపోలేను. ఇప్పుడు 'బాద్‌షా'లోనూ ఓ మంచి గీతాన్ని ఆలపించాను. తమన్‌ సంగీతంలో బలమైన రిథమ్‌ ఉంది అన్నారు.

తనకు తెలుగు అంతగా తెలియకపోయినా...పాడేటప్పుడు ఇబ్బందులేవని చెప్తూ... నేను పంజాబీలో ఎలా పాడతానో తెలుగులోనూ అంతే సులభంగా పాడగలుగుతున్నాను. తెలుగులో పాడటం నాకు భలే సరదా. ఈ భాషతో నాకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందనిపిస్తుంటుంది. ఇక్కడ నేను పాడిన ప్రతి పాటా ఇప్పటికీ నాకు గుర్తే. పదం పలుకుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులేమైనా ఎదురైతే... సంగీత దర్శకులు, రచయితలు సహాయం చేస్తుంటారు. తెలుగులో నేను పాడింది తక్కువే అయినా... ఆ పాటలన్నీ చక్కటి ఆదరణ పొందాయి అన్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం కోసం తమిళ హీరో శింబు ఓ పాటను ఆలపించారు. 'డైమండ్‌ గాళ్‌..' అంటూ సాగే హుషారైన పాటను ఆయన పాడారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. 'బ్యాక్‌ బెంచ్‌ స్డూడెంట్‌' చిత్రం కోసం కూడా శింబు గాయకుడి అవతారం ఎత్తారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే 'బాద్‌ షా' కోసం శింబు పాట పాడేందుకు అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే నెలలో 'బాద్‌షా' పాటల్ని విడుదల చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X