ఢిల్లీకి చేరిన ‘డామ్999’ సినిమా గొడవ..
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల 'డామ్999" అనే సినిమాపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిషేదం విధించడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందలోళ...తాజాగా ఢిల్లీకి చేరింది. డామ్ 999 సినిమాపై తమిళనాడు జయలలిత ప్రభుత్వం విధించిన నిషేదాన్ని ఎత్తి వేయాలని, కేంద్రం జోక్యం చేసుకుని ఈ సినిమా విడుదలయ్యేందుకు సహకరించాలని కేరళకు చెందిన యువమోర్చా నేతలు...ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఆంటోని ఇంటికి ర్యాలీ మొదలు పెట్టారు. రాజకీయ విబేధాలను కళపై రుద్దడం సరికాదని, వెంటనే ఆ సినిమాపై నిషేదం ఎత్తి వేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
బిజ్ టీవీ నెట్కవర్క్ నిర్మించిన ఈ చిత్రానికి సోహన్ రాయ్ దర్శకత్వం వహించారు. 1975లో చైనాలో బ్యాంకియో డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనలో దాదాపు 2 లక్షల మంది మరణించారు. దీనిని ఆధారంగానే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, ఇంగ్లీష్ బాషల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే కేరళ, తమిళనాడు మధ్య ఉన్న 'ముళ్ల పెరియార్" డ్యామ్ విషయంలో ఉన్న వివాదం నేపథ్యంలో డామ్999 సినిమాలో ముళ్లపెరియా డామ్ ప్రస్తానవ ఉందని, ఇది రెండు రాష్ట్రాల మధ్య గొడవకు కారణం అవుతుందనే కారణంతో ఈ చిత్రాన్ని జయలలిత ప్రభుత్వం నిషేదించింది.


Click it and Unblock the Notifications











