twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఢమరుకం’తో మనోభావాలు దెబ్బతీసారంటూ ఆందోళన

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఢమరుకం సినిమాలో కటిక వృత్తిదారుల మనోభావాలను కించపర్చే విధంగా జోడించిన కసాయి పదాన్ని వెంటనే తొలగించాలని అరె కటిక హక్కుల పోరాట సమితి డిమాండ్‌ చేసింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి థియేటర్‌ ముందు ఆరెకటిక వృత్తిదారులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరెకటిక హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపిక సుధాకర్‌, ఈశ్వర్‌, గురుచరణ్‌, ప్రవీణ్‌, సురేశ్‌ లు మాట్లాడుతూ ఢమరుకం సినిమాలో కసాయి పదాన్ని తొలగించాలని అన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని పేర్కొన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న చిక్కడపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను శాంతింపచేసి పంపించారు.

    ఆరెకటికల మనోభావాలను కించపరిచే విధంగా ఢమరుకం సినిమాలో కసాయి అనే పదాన్ని వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఆరెకటిక పోరాటసమితి ఆందోళన చేసింది. శనివారం ఢమరుకం సినిమా ప్రదర్శిస్తున్న ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని దేవి థియేటర్‌లో మధ్యాహ్నం ఆటను చూడటానికి వచ్చిన సమితి నాయకులు సినిమా మధ్యలో హాల్లోనే ఆందోళన చేశారు. చిత్ర పోస్టర్లను, ప్లెక్సీలను చించేశారు.

    పోలీసులు ఆందోళనకారులను బయటకు తీసుకురాగా... హాల్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగికార్ సుధాకర్ మాట్లాడుతూ ఢమరుకం సినిమా డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హీరో నాగార్జునపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సంఘ ప్రతినిధులు ప్రవీణ్‌కుమార్ లాల్, ఈశ్వర్‌లాల్, గురుచరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

    వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' శుక్రవారం విడుదల అయ్యింది.డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్స్ ని ,ఎగ్జిబిటర్స్ ని ఆనందపరిచింది. ఈ వీకెండ్ రెండు రోజులు అదే కలెక్షన్స్ కంటిన్యూ అవుతాయని అంటున్నారు.

    English summary
    Now RSS workers started protesting in front of Devi Theater, Hyderabad demanding deletion of objectionable scenes from Damarukam film. The film starring Nagarjuna and Anushka hit the screens friday after delay of numerous occasions. Director Srinivasa Reddy assured them he would delete the word 'Kasai' and other objectionable scenes from the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X