‘డమరుకం’ ఆడియో సెప్టెంబర్ 10న
హైదరాబాద్: నాగార్జున, అనుష్క జంటగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం'. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా.వెంకట్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల 10న ఈ చిత్రం ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నాగార్జున కెరీర్‌లోనే హై బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మించామని, దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'నాగార్జున కెరీర్లోనే ఇదో పెద్ద లాండ్ మార్క్ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారు' అని చెప్పారు. కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాుడుతూ...'ఒక వైపు పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి' అని చెప్పారు.
నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.


Click it and Unblock the Notifications











