శివుని ఆజ్ఞతోనే ‘ఢమరుకం’: నాగార్జున
హైదరాబాద్ : శివుడు పెట్టిన ముహూర్తానికే 'డమరుకం' చిత్రం విడుదలవుతోందని, రేపు(నవంబర్ 23) విడుదలవుతున్న సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆ చిత్ర నటుడు అక్కినేని నాగార్జున గురువారం వ్యాఖ్యానించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ను కలిసేందుకు నాగార్జున ఈ రోజు జైలుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రశ్నించగా....నిమ్మగడ్డ ప్రసాద్ తనకు స్నేహితుడు కావడం వల్లనే ప్రతి నెలా ములాఖత్ సమయంలో ఆయన్ను కలుస్తున్నానని వెల్లడించారు. డమరుకం చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. సినిమా హాలీవుడ్ రేంజిలో ప్రేక్షకులకు అనుభూతిని కలిగిస్తుందన్నారు.
డమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా, ఆర్ వెంకట్ నిర్మించారు.. వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











