నాగార్జున ‘డమరుకం’ సినిమా ఏమైంది?
'రాజన్న' సినిమా తర్వాత నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నాగార్జున 'షిరిడి సాయి' షూటింగులో బిజీగా గడుపుతుండటంతో మీడియాలో కూడా షిరిడి సాయి సినిమా గురించే చర్చ సాగుతోంది. దీంతో డమరుకం సినిమా విశేషాలు గత కొన్ని రోజులుగా మరుగున పడిపోయాయి. ప్రస్తుతం ఢమరుకం సినిమా సంగతి ఏమైందంటే...?
నాగార్జున ఇదివరకు నటించిన సినిమాల కంటే భిన్నంగా భారీ గ్రాఫిక్స్ తో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న డమరుకం మూవీకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా 7 రోజుల షూటింగ్, ప్యాచ్ వర్కు జరుగాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో నాగార్జున షూటింగులో పాల్గొననున్నారు. పెండింగ్ వర్కు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఢమరుకం చిత్రంలో మొత్తం 6 పాటలు ప్లాన్ చేశారు. ఆడియో ఏప్రిల్ లో విడుదల చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా, సమీరారెడ్డి ఐటం సాంగులో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఢమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చోటాకె.నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











