డమరుకం ఆ నవలను కాపీకొట్టలేదన్న నాగార్జున

By Bojja Kumar

హైదరాబాద్: అక్కినేని నాగార్జున నటిస్తున్న 'డమరుకం' చిత్రం రేపు(నవంబర్ 10) గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాగార్జున కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సోషియో పాంటసీ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజిలో అద్బుతమైన గ్రాఫిక్స్ ఉన్నాయని నాగార్జున చెప్పడం కూడా సినిమాపై అంచనాలు పెంచింది.

అయితే ఈచిత్రం మీడియాలో...రచయిత అమిష్ కు చెందిన 'ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా' అనే నవల ఆధారంగా డమరుకం చిత్రం రూపొందించారనే ప్రచారం జరుగడంపై నాగార్జున ఖండించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డమరుకం చిత్రం ఏ నవలకు కాపీ కాదని, ఇది పూర్తిగా ఫ్రెష్ కాన్సెప్ట్ అని, రచయిత అమిష్ కు ఈ విషయమై వివరణ ఇచ్చామని స్పష్టం చేసారు.

స్టోరీ విసయానికొస్తే... వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది మెయిన్ కాన్సెప్ట్.

ఆటో డ్రైవర్ మల్లిఖార్జున(నాగార్జున) చుట్టూ తిరుగుతుంది. కొన్ని అతీత శక్తులు గల అమ్మాయి(అనుష్క)ని మల్లిఖార్జున ప్రేమిస్తాడు. ఆ శక్తులను వశం చేసుకోవడానికి విలన్(రవి శంకర్) ఆమెను చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఆమెను ప్రేమిస్తున్న మల్లిఖార్జున కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. మరి శివుడికి, కైలాసానికి, వీరికి ఏమిటం సంబంధం అనే విషయాలు ఆ తర్వాతి స్టోరీ. ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా, ఆర్ వెంకట్ నిర్మించారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X