నాగ్, చార్మి ఐటం సాంగ్ ఫోటో...
హైదరాబాద్: నాగార్జున త్వరలో 'డమరుకం' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈచిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 10వ తేదీన ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోసియో ఫాంటసీ నేపథ్యంలో నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అయితే ఇందులో నాగార్జున అభిమానులు కోరుకునే మాస్ మసాలా ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేసారు. ఇందులో నాగార్జునతో కలిసి చార్మి స్టెప్పులేస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటో విడుదల చేసారు.
డమరుకం చిత్రంలో శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్ నిర్మాత. ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, దేవన్, అవినాష్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహనిర్మాత: వి.సురేష్ రెడ్డి, కూర్పు: గౌతమ్‌రాజు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











