పవన్ వెనక్కి... నాగ్ ‘డమరుకం’ ముందుకు!

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై డా.వెంకట్ నిర్మించిన చిత్రం 'డమరుకం'. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి అక్టోబర్ 11న పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' విడుదల చేయాలని ప్లాన్ చేయడంతో.....నాగ్ డమరుకం చిత్రం మరో వారం లేటుగా అక్టోబర్ 19న అనుకున్నారు. కానీ పవన్ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడంతో 'డమరుకం ' చిత్రం ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ తెలుగు చిత్రాల చరిత్రలోనే ఓ సరికొత్త చిత్రంగా నిలిచిపోయే ఈ చిత్రం అద్భుతమైన గ్రాఫిక్స్‌తో, హై బడ్జెట్ మూవీగా రూపొందిందని, ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ఇండియన్ స్క్రీన్‌కు ఓ సరికొత్త ఇమేజ్ ఈ చిత్రంతో రానుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన ప్రేక్షకులనుండి లభిస్తోందని, విడుదలకు ముందే ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించడం సంతోషమని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ప్రకాష్‌ రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి, సమీర్, శ్రవణ్, రాజాశ్రీ్ధర్, ప్రభు, కమల్, రజిత, ప్రగతి, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ, విజయరంగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చోటాకె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: జొన్నవిత్తుల, చంద్రబోస్, భాస్కరభట్ల, సాహితి, రామజోగయ్యశాస్ర్తీ, కరుణాకర్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X