నాగ్ ‘డమరుకం’ అక్టోబర్ 12న
హైదరాబాద్ : కింగ్ నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం రిలీజ్ ఎట్టకేలకు ఖరారైంది. ఈచిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 10వ తేదీన ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అంతా మరిచిపోతున్న నేపథ్యంలో మేల్కొన్న దర్శక నిర్మాతలు పబ్లిసిటీ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం దర్శక నిర్మాతలు చిత్రానికి సంబంధించిన ఫైనల్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో దాదాపు గంటసేపు గ్రాఫిక్స్ ఉంటాయని, తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విధంగా వాటిని డిజైన్ చేసారని చెప్తున్నారు.
ఈ నెల 27 ఈచిత్రానికి సంబంధిన షూటింగ్ ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి కానుంది. డమరుకం చిత్రంలో శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్ నిర్మాత. ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, దేవన్, అవినాష్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహనిర్మాత: వి.సురేష్ రెడ్డి, కూర్పు: గౌతమ్‌రాజు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











