twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవి.. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో!

    |

    ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసే టెలివిజన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో 'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవి దక్కింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా ఆయనను నియమించడం జరిగింది. ఇప్పటికే సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ చైర్మన్ పదవిలో కొనసాగుతుండగా, తాజాగా 'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

    తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త శ్రీ వేంకటేశ్వర్లు (తిరుపతి), ఎస్వీబీసి ఛైర్మన్ పృథ్వీ, తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ (వైఎస్ఆర్సిపీ), 'రాగల 24 గంటల్లో' చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు హాజరయ్యారు. 'ఢమరుకం' శ్రీనివాస్ రెడ్డికి పృథ్వీ శాలువా కప్పి సన్మానం చేశారు. ఇక వీరందరి సమక్షంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

     Damarukam Srinivasa Reddy elected as SVBC Board of director

    ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డి నియమితులు కాబోతున్నారనే వార్త సెన్సేషన్ అయింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి అనగానే అందరూ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనుకొని ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. కానీ అది తానూ కాదని ఆయన ఢమరుకం దర్శుకుడు శ్రీనివాస్ రెడ్డి అని కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో ఆ విషయం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

    English summary
    Damarukam movie director Srinivasa Reddy elected as SVBC Board of director. Just now he takes that responsibility.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X