‘డమరుకం’ రిలీజ్..ఆరెండు డేట్స్ టార్గెట్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, అనుష్క జంటగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'డమరుకం' చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరు ఈ నెల 20 విడుదల చేద్దామని డిసైడైనా....చివరి నిమిషయంలో మళ్లీ వాయిదా వేసారు.
పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదలైన నేపథ్యంలో 'డమరుకం' విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించలేదని టాక్.
తాజాగా ఈచిత్రం విడుదలపై నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. వీలైతే ఈ నెల 26 గానీ, నవంబర్ 9న గానీ, అప్పటికీ పరిస్థితులు అనుకూలించక పోతే నవంబర్ 15లోపు ఏదో ఒక తేదీలో విడుదల చేయాలని చూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి థియేటర్లు భారీగా దక్కించుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే విడుదలపై ఇంకా స్పష్టత రావడం లేదు.
ఇక సినిమా విశేషాల్లోకి వెళితే.......దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి అందరు టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. సినిమాలో లాస్ట్ 35 నిమిషాలు గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల రేంజిలో ఉంటాయి. కేలం గ్రాఫిక్స్ వల్లనే సినిమా ఆడుతుందని నేను అనను. కథకు తగిన విధంగా గ్రాఫిక్స్ చాలా భాగా సూటయ్యాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు నాగార్జున.
నాగార్జున, అనుష్క నటిస్తున్న డమరుకం చిత్రంలో ప్రకాష్ రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.


Click it and Unblock the Notifications











