'దమ్ము' ఆడియో విడుదల తేదీ మార్పు
ఎన్టీఆర్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న దమ్ము చిత్రం ఆడియో మార్చి 23 న విడుదల చేయటానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని ఇప్పుడు మార్చి 29కి పోస్ట్ ఫోన్ చేసారు. అయితే వెన్యూని మాత్రం శిల్పకళా వేదికగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇక చిత్రాన్ని మాత్రం ఏప్రియల్ 27నే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దమ్ము చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. నందమూరి ఫ్యామిలీకి సింహా లాంటి భారీ విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను 'దమ్ము' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











