'దమ్ము' ఆడియో తేదీ ఖరారు ప్రకటన

By Srikanya

ఎన్టీఆర్‌, త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దమ్ము'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నామని నిర్మాతలు మీడియాకు ప్రకటన రూపంలో తెలియచేసారు. ఈ విషయమై నిర్మాత అలెగ్జాండర్‌ వల్లభ మాట్లాడుతూ ''కీరవాణి అందించిన బాణీలు బాగున్నాయి. మాస్‌ని తప్పకుండా అలరిస్తాయి. ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన శ్లోకం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్‌ నృత్యాల కోసం చాలా కష్టపడ్డారు. అదంతా తెరపై కనిపిస్తుంది. ఈ నెల 29న విడుదల చేస్తున్నాం ''అని చెప్పారు. ఇక ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.

ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్‌ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్‌ యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. అలాగే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా కార్తీక చేస్తోంది. ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. పోలీస్ అధికారిగా,ఫ్యాక్షనిస్టుగా ఎన్టీఆర్ విభిన్న షేడ్ లలో చూపే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపాడేస్తాయని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X