జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ రివేంజ్ కహానీ...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. యాక్షన్ అండ్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు.
తాజాగా అందిన సమచారం ప్రకారం...దమ్ము చిత్రం ఓ పవర్ ఫుల్ రివేంజ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోందిన తెలుస్తోంది. కొన్నిట్విస్టులతో శక్తివంతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అంటున్నారు. జూ ఎన్టీఆర్ ఇందులో మల్టిపుల్ గెటప్స్ లో దర్శనం ఇవ్వబోతున్నారు.
క్రేజీ హీరో ఎన్టీఆర్ కావడంతో దర్శకుడు బోయపాటి అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శద్ద తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు లీకైన దమ్ము డైలాగులకు అభిమానులను మంచి రెస్పాన్స్ వస్తోంది కూడా.
సక్సెస్ ఫుల్ షూటింగ్ పూర్తి చేసి సినిమాను సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రాలన్నింటిలోకెల్లా 'దమ్ము' సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. అదే విధంగా గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఎన్టీఆర్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూ....డిఫరెంట్ గెటప్స్ లో దర్శనం ఇవ్వబోతున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











