ఎన్టీఆర్ దమ్ము చిత్రం విడుదల ఎప్పుడంటే
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం దమ్ము. త్రిష ,కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 2012 రెండో వారంలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు షూటింగ్ ని శరవేగంతో చేస్తున్నారు. ఈ చిత్రం పూజ పిబ్రవరి 18,2011 న జరిగింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 3,2011 లో మొదలైంది. మధ్యలో ఊసరవెల్లి విడుదల కోసం అని బ్రేక్ ఇచ్చి కంటిన్యూ చేసారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ లావు తగ్గి మరీ స్లిమ్ గా కనపడతానని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని చెప్పుకుంటున్నారు. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి ఇప్పటికి నాలుగు పాటలు కంపోజ్ చేసారు. ఇంకా మూడు బ్యాలెన్స్ ఉన్నాయి.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము పైనే ఎన్టీఆర్ పూర్తిగా దృష్టి పెడుతున్నారు.సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు.అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు. తన సక్సెస్ మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











