అన్నపూర్ణ స్టూడియోపై ఎన్టీఆర్ ‘దమ్ము’
జూ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా 'దమ్ము' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'దమ్ము' చిత్రం సెకండ్ షెడ్యూల్ జనవరి 6 నుంచి రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. టాకీ పార్టుకు సంబంధించిన పలు కీలక సన్ని వేశాలు ఇక్కడ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
సింహా లాంటి అద్భుతమైన హిట్ ను నందమూరి కుటుంబానికి అందించిన బోయపాటి... జూనియర్ తో ఈ సారి భారీ సంచలనం సృష్టించే దిశగా కసరత్తు చేస్తున్నాడు. జూనియర్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతున్నప్పటికీ...ఇప్పటి వరకు ఆయన పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.
దమ్ము చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష లీడ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగ, కార్తీక సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా దమ్ము చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











