'దమ్ము' ఫస్ట్ కాపీ, సెన్సార్ ఎప్పుడంటే...
బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రం ఏప్రియల్ 27న విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం వేగవంతంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిఐ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది. ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఏప్రియల్ 19న ఫస్ట్ కాపీ వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రం రీ రికార్డింగ్,వి ఫిఎక్స్ లు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కి ఈ చిత్రం ఈ నెల 19 లేదా 20న జరగనుందని తెలుస్తోంది.
ఇక 'దమ్ము'లో ఎన్టీఆర్ డిఫెరెంట్ గా సాగుతుంది. దాని గురించి దర్శకుడు బోయపాటి శ్రీను వివరిస్తూ...అందరూ బాగుండాలి. అందరిలో నేనుండాలి...ఇదీ ఓ యువకుడి సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా అతను ఊరుకోడు. తన దారికి అడ్డొచ్చిన వారికి దమ్ము చూపేదాకా వదలడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు .
అలాగే ... ఎన్టీఆర్ నటనను ఇప్పటిదాకా ఒకవైపే చూశారు. రెండోవైపు చూపించే చిత్రమిది. నడక, స్త్టెల్... అన్ని విషయాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించారు. ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిపడేలా, ప్రతి అభిమానీ గర్వపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కీరవాణి స్వరపరిచిన పాటలకి చక్కటి స్పందన లభిస్తోంది. నిర్మాత వల్లభ సహకారం మరిచిపోలేనిదని అన్నారు.
నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను మించిపోయేలా ఈ చిత్రం ఉంటుంది. కథపై పట్టున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన విధానం చాలా బాగుంది. మా అబ్బాయి ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఒక గొప్ప చిత్రాన్ని తీశామన్న ఆనందం కలిగింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు తుదిదశలో ఉన్నాయి. పది రోజుల్లో సెన్సార్‌కి వెళతామని''అన్నారు.
నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం, పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్.రామారావు సమర్పకులు.


Click it and Unblock the Notifications











