దమ్ము, రచ్చ అంటూ దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో దమ్ము,రచ్చ చిత్రాలతో సొమ్ము చేసుకోనున్నాడు. ఈ రెండు చిత్రాల నైజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పటికే దిల్ రాజు ..తెలుగు త్రీ ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు రైట్స్ మొత్తం ఆంధ్రా అంతటికి తీసుకున్నారు. అలాగే సిద్దార్ద తన సొంత బ్యానర్ పై చేస్తున్న లవ్ ఫెయిల్యూర్ రైట్స్ కూడా తీసుకుని సమర్పిస్తున్నారు. ఇక వీటిన్నటికన్నా దమ్ము,రచ్చ చిత్రాలకే ఎక్కువ మొత్తం వసూలు అవుతుంది. ఇక దమ్ము చిత్రాన్ని సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరక్ట్ చేస్తూండటం ఒక కారణమైతే,ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా నటించే చిత్రం కావటం మరో కారణమంటున్నారు. ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ మార్కెట్ లో ఉంది.
ఇక మరో ప్రక్క ఆరెంజ్ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న రామ్ చరణ్ రచ్చ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. రచ్చ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా ఉంటాయని ఇప్పటికే అంతటా టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంతేగాక తన తండ్రి నటించిన గ్యాంగ్ లీడర్ లోని హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయటం వంటి మశాలాలు ఈ చిత్రాన్ని మెగా అభిమానులుకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఇక మార్కెట్ లో క్రేజ్ ఉన్న ఈ రెండు చిత్రాలను భారీ రేటు ఇచ్చి దిల్ రాజు సొంతం చేసుకున్నారు. నైజాంలో దిల్ రాజుకు పోటీ వచ్చేవారు ఎవరూ లేరని మరోసారి నిరూపించినట్లైంది.


Click it and Unblock the Notifications











