'దమ్ము' విడుదల గురించి ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రం 'దమ్ము"మార్చి 2012 లో విడుదల కానుందని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ...దమ్ము అనే టైటిల్ నే ఖరారు చేసామని,అయితే నిర్మాత కె ఎస్ రామారావు అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారని అన్నారు.ఈ నెలాఖరునుంచి ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జరుగుతుందని,తాను పాల్గొంటానని అన్నారు. అలాగే దమ్ము పక్కా మాస్ మూవీ అని, హై వోల్టేజ్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషన్, గ్లామర్ తో తన అభిమానలుకు పూర్తి స్ధాయి విందులా ఉంటుందని అన్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లో ఆరంభమైంది. కానీ ఊసరవెల్లి చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ 'దమ్ము" దర్శక, నిర్మాతలు బోయపాటి శ్రీను, కె ఎస్ రామారావును కొంత వ్యవధి కావాలని కోరటంతో ఈ చిత్ర షూటింగ్ ను కొంతకాలం నిలిపివేశారు.
ఎంఎం కీరవాణి ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం పాటలు కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. సింహా విజయంతో ఊపు మీద ఉన్న బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ఎలాగైనా సూపర్ హిట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఊసరవెల్లి చిత్రం డివైడ్ టాక్ ఉన్నా కలెక్షన్స్ పరంగా ఎక్కడా డ్రాప్ కాకుండా నడుస్తోంది.


Click it and Unblock the Notifications











