'బిజినెస్ మ్యాన్ 'తో థియేటర్స్ లో 'దమ్ము'
మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రంతో పాటు ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము టీజర్స్ చూడబోతున్నాం. బిజినెస్ మ్యాన్ ఆడే ధియోటర్స్ లో దమ్ము చిత్రం టీజర్స్ వదిలితే ఎక్కువ మంది చూసే అవకాశముంటుందని దమ్ము నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీజర్స్ ని తయారు చేస్తున్నారు. జూ ఎన్టీఆర్ ఈ టీజర్స్ పై ప్రత్యేకమైన శ్రద్ద పెడుతున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంతటా మంచి క్రేజ్ వచ్చింది.
ఇక దమ్ము విషయానికి వస్తే.. ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం దమ్ము. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 2012 రెండో వారంలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు షూటింగ్ ని శరవేగంతో చేస్తున్నారు. ఈ చిత్రం పూజ పిబ్రవరి 18, 2011న జరిగింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 3, 2011లో మొదలైంది. మధ్యలో ఊసరవెల్లి విడుదల కోసం అని బ్రేక్ ఇచ్చి కంటిన్యూ చేసారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ లావు తగ్గి మరీ స్లిమ్ గా కనపడతానని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని చెప్పుకుంటున్నారు. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి ఇప్పటికి నాలుగు పాటలు కంపోజ్ చేసారు. ఇంకా మూడు బ్యాలెన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











