For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘కెమెరామెన్ గంగతో..’లో ఆ రెండు హైలెట్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: 'నువ్వు నందావైతే నేను బద్రి..బద్రినాథ్' ఈ డైలాగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీసు షేక్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' సూర్ డూపర్ హిట్ అయింది. ఆ చిత్రం తర్వాత పన్నెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న సూపర్ సెన్సేషనల్ మూవీ 'కెమెరామెన్ గంగతో రాంబాబు'ను సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బేనర్‌పై నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

  సెప్టెంబర్ 2 పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి దానయ్యను అడిగినప్పుడు... 'పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో. పవర్ స్టార్ పెర్ ఫార్మెన్స్ హైలెట్‌గా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్మెంట్, సూపర్ సాంగ్స్‌తో, థ్రిల్లింగ్ యాక్షన్‌తో ప్రేక్షకులు, పవన్ అభిమానులు అందరూ మెచ్చే విధంగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' రూపొందుతోంది. టోటల్ టాకీ పార్ట్ పూర్తయింది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌రెండు పాటల చిత్రీకరించడంతో చిత్రంలోని ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. మా బేనర్లో, పవర్ స్టార్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ కోసం రాసిన సూపర్ డైలాగలకు థియేటర్లు చప్పట్లతో దద్దరిల్లుతాయి. ఏకథాటిగా సింగిల్ షెడ్యూల్ లో ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేయగలిగామంటే పూరి ప్లానింగ్, పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ ప్రధాన కారణాలు. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఇంత పెద్ద సెన్సేషనల్ ఫిల్మ్ తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం నిర్మాణంలో అన్ని విధాలా ఎంతో సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను' అన్నారు.

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...'బద్రితో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మళ్లీ ఇన్నేళ్లకు సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి పవర్ ఫుల్ సినిమా ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నారో అలాంటి పవర్ ఫుల్ సినిమా ఇది. డెఫినెట్ గా కళ్యాణ్ కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ అవుతుంది. ఇందులో కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తారు' అన్నారు.

  హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ...'పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న ఫష్ట్ మూవీ ఇది. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే పూరి జగన్నాథ్ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. కెమెరామెన్ గంగతో క్యారెక్టర్ నాకు ఎంతో బాగా నచ్చి చేస్తున్న క్యారెక్టర్' అన్నారు.

  క్లైమాక్స్ సన్నివేశం జరుగుతుండగా ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ చెప్పిన పెద్ద డైలాగ్ కి షాట్‌లో ఉన్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపితే దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకుని అభినందించారు. ఇలాంటి సూపర్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి.

  ఈ చిత్రం కోసం మణిశర్మ 5 సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. పూరి-మణి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి', 'చిరుత' వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత వస్తోన్న మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇది. సెప్టెంబర్లో విడుదలయ్యే ఈ ఆడియోలో 5 పాటలు దేనికదే హైలెట్ అవుతాయన్నారు.

  పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  ‘Cameraman Ganga tho Rambabu’ starring Power Star Pawan Kalyan and Milky white beauty Tamanna has completed the talkie part and the post-production works of the film are set to commence. Directed by Puri Jagannath and produced by Danayya DVV on Universal Media banner, the audio of Cameraman Ganga tho Rambabu composed by Mani Sharma is expected to be launched on 15th September.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X