పూరి ఇంతే

సురేష్ ప్రొడక్షన్ లో రవితేజ చేస్తున్న సినిమా షూటింగ్ చివరకు రావటంతో నేనింతే ప్రారంభించమని పూరీని కలిసి అడిగాడుట. దాంతో తమ్ముడిని ప్రక్కన పెట్టి ఈ ప్రాజెక్టు చేపట్టాడు. దీని తరువాత నాగార్జున కుమారుడు నాగ చైతన్య లాంచింగ్ ఫిల్మ్ డైరక్ట్ చెయ్యాల్సి ఉంది. కాబట్టి సాయిరామ్ శంకర్ సినిమా ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చంటున్నారు. తమ్ముడు సంగతి తరువాత చూసుకోవచ్చు ముందు కెరీర్ ని ముందుకు తీసుకెళ్ళే క్రేజి కాంబినేషన్ లు క్లిక్ అయ్యేటట్లు చూసుకోవాలి అని పూరీ భావిస్తున్నారు. ఈ విషయంపై ఎవరన్నా ఏదన్నా చెప్పబోతే నేనింతే ...నా ఆలోచనలు ఇంతే అన్నట్లు చూస్తున్నాడట. దానికి దగ్గట్టే 'దేశముదురు' వంటి మెగా హిట్ తరువాత పూరి,దానయ్య కలిసి చేస్తున్న సినిమా కావటంతో ట్రేడ్ లో అప్పుడే ఎంక్వైరీలు ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications











