Just In
- 6 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్పీడు మీదవున్న తమన్నాకు స్పీడే నచ్చుతుందట...!
టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం కోసం కాజల్, సమంతాలతో బాటు పోటీపడుతున్న మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా, ఒక సినిమా ఒప్పుకునే ముందు స్పీడు చూస్తుందట. ఇంతకీ ఆ స్పీడు ఏమిటనేగా మీ డౌటు... అక్కడికే వస్తున్నాం... కథలో స్పీడు ఉండాలట! దర్శకుడు కథ చెబుతున్నప్పుడు ఎక్కడా స్లోగా అనిపించకూడదట. చకచకా కథ సాగిపోవాలి. 'నేనొక సినిమా ఒప్పుకోవాలంటే ముందుగా ఆ కథ నాకు బాగా నచ్చాలి. కథ నచ్చాలంటే అందులో యమా స్పీడుండాలి. ఎక్కడా బ్రేక్స్ కానీ, స్లో అవుతున్న ఫీలింగ్ కానీ వుండకూడదు. అసలు కథ చెబుతున్నప్పుడే ఆ దర్శకుడికి దాని మీదున్న గ్రిప్ తెలిసిపోతుంది. కథలో స్పీడున్నప్పుడే అది నలుగుర్నీ ఆకట్టుకుంటుందని నమ్ముతాను. అందుకే అలాంటి స్క్రిప్టులకే నా ఓటు వేస్తాను'అంటోంది ఈ మిల్కీ బ్యూటీ.
ఆమె నటించిన 'ఊసరవెల్లి' ఈ నెల 6 న రిలీజ్ అవుతుండగా, రామ్ చరణ్ తో 'రచ్చ', ప్రభాస్ తో 'రెబల్', రామ్ తో 'ఎందుకంటే...ప్రేమంట' సినిమాలలో తమన్నా నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ" చిత్రానికి సంబంధించి హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో డ్యాన్స్ అకాడమీ సెట్ ని రూపొందించారట. దీని కోసం భారీగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సంబంధించి చరణ్, తమన్నా పాల్గొనగా ఈ సెంట్ లో కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారట. కృష్ణ భగవాన్, బ్రహ్మానందం కూడా ఈ సీన్స్ లో పాల్గొంటున్నారని వినికిడి. వీరి మధ్య సాగే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని సమాచారం.