హీరోయిన్లతో లైంగిక వేధింపులు.. షాకింగ్ వీడియోలు, ఫొటోలు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ట్వీట్
తమిళ సినిమా పరిశ్రమలో తనను లైంగికంగా వేధించే హీరోయిన్ల పేర్లు బయటపెడుతానని ప్రముఖ కొరియోగ్రాఫర్ షరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ టెలివిజన్ రూపొందించిన డ్యాన్స్ షో ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువయ్యాడు. నయనతార, త్రిషా లాంటి పలువురు అగ్ర హీరోయిన్లకు ఆయన నృత్య దర్శకుడిగా వ్యవహరించారు. సెన్సేషన్ కోరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొన్న షరీఫ్ ట్వీట్ కోలీవుడ్‌లో కలవరం రేపుతున్నది.

వేధించే ఆడ సెలబ్రిటీల పేర్లు
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు పాల్పడే ఆడ సెలబ్రిటీల పేర్లను అక్టోబర్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తాను. అంతవరకు ఓపిగా వేచి చూడండి అంటూ షరీఫ్ ట్వీట్ చేశారు. పలు టెలివిజన్ల ఛానెల్లకు తన ట్వీట్‌ను ట్యాగ్ చేయడం గమనార్హం.
29వ తేదీన ప్రకటిస్తాను
మీరు ఊహించని సినీ తారల పేర్లను బయటపెడుతా. వారి పేర్లను ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కు వెల్లడిస్తా. ట్వీట్‌లో చెప్పే ప్రతీ విషయం నమ్మదగిందే. 29 తేదీ వరకు వేచి ఉండండి అంటూ ఆయనే రిక్వెస్ట్ చేశారు.

షాకింగ్ గురిచేసే వీడియోలు
లైంగిక వేధింపులకు పాల్పడే హీరోయిన్ల పేర్లే కాకుండా షాకింగ్ గురి చేసే వీడియోలను, మరి కొన్ని ఫొటోలను విడుదల చేస్తాను. మీరు ఏ మాత్రం కూడా ఊహించకుండా ఉంటాయి వారి పేర్లు అని షరీఫ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రజనీకాంత్ పాటకు కొరియోగ్రఫి
ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న పెట్ట సినిమాలోని ఓ పాటకు షరీఫ్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రాజారాణి, త్రిషా, ఇలియానా, నయనతార చిత్రాలకు పనిచేశారు. మరికొందరు ప్రముఖ హీరోలతో కూడా కలిసి పనిచేశారు. చిన్మయి, శృతిహరిహరన్, అమలాపాల్ లాంటి హీరోయిన్లు తాజాగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో షరీఫ్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.


Click it and Unblock the Notifications











