డాన్సర్ కు లైగర్ ఇచ్చిన బూస్టింగ్ మామూలుగా లేదు కదా...!
తెలుగు రాష్ట్రాల్లోని ఒరిజినల్ టాలెంట్ ను జల్లెడ పడుతున్న డాన్స్ ఐకాన్ కు తారలు సైతం దాసోహం అంటున్నారు. రీసెంట్ గా లైగర్ ప్రమోషన్స్ నిమిత్తం విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎపిసోడ్ లో జరిగిన సంఘటన మాత్రం అందరినీ కదిలించింది.
ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ లో రాయిచూర్ ఆనంద్ అనే డాన్సర్ ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో ఫేమస్ అయిపోయాడు. అదిరిపోయే డాన్స్ మూవ్స్ తో అందరినీ కట్టిపాడేస్తున్న ఆనంద్, మట్టిలో మాణిక్యం అన్న నానుడికి అద్దం పడుతున్నాడనే చెప్పాలి. స్లమ్స్ నుంచి వచ్చిన సిసలైన డాన్సర్ గా అందరి మన్ననలూ అందుకుంటోన్న ఆనంద్ తొలి పర్ఫార్మెన్స్ తోనే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దృష్టిని ఆకట్టుకున్నాడు.

అదిరిపోయే స్టెప్పులతో జడ్జిలకే చమటలు పట్టించిన ఆనంద్ బ్యాగ్ గ్రౌండ్ గురించి షో హోస్ట్ ఓంకార్ వివరించిన సంగతి తెలసిందే. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలోనే విజయ్ దేవరకొండ ఆనంద్ కు ఒక ప్రామిస్ చేసిన సంగతి చూశాం. సరైన బట్టలు కూడా లేని పరిస్థితిలో డాన్స్ ఐకాన్ కు వచ్చిన ఆ కంటెస్టెంట్ కు విజయ్ తన రౌడీ బాయ్స్ కలెక్షన్స్ నుంచి ఎన్ని దుస్తులు కావాలంటే అన్ని తీసుకోమని హామీ ఇచ్చాడు.
అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన డీటైల్డ్ వీడియో క్లిప్ ను ఆహా విడుదల చేసింది. ఆనంద్ జీవితంలోని ఒడిదుడుకులను, జీవిన చిత్రాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన ఈ వీడియో చూసిన వారినికి కదిలించక మానదు. కూరగాయలు అమ్ముతూ బతుకు బండిని లాగిస్తున్న తల్లి, ఆటో నడుపుతున్న తండ్రి, మురికివాడలోనే గడిచిన జీవితం ఇవేమీ ఆనంద్ కలలు సాకారం చేసుకునేందుకు అడ్డంకులు కాలేదు. టాలెంట్ కు బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదు అని నిరూపిస్తున్న ఆనంద్ ఇప్పుడు తెలుగువారి ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారాడు. మరి ఇదే స్ఫూర్తితో అతను మరింత రాణించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











