వర్మ పిచ్చికుక్క.. వాడిని బట్టలూడ దీసి కొట్టాలి.. గుండు కొట్టించి గాడిద మీద.. రాకేష్ మాస్టర్

By Rajababu

Recommended Video

వాడొక పిచ్చికుక్క.. బట్టలూడదీసి కొట్టాలి.. !

తెలుగు సినీ పరిశ్రమలో రాకేష్ మాస్టర్ స్టార్ కోరియోగ్రాఫర్. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే వాడిగా మాటలు సంధిస్తాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ, రాంగోపాల్ వర్మలపై ధ్వజమెత్తాడు. వారిద్దరిపై దారుణమైన కామెంట్లు చేశాడు. రాకేష్ మాస్టర్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

నన్ను విలన్‌గా చూస్తున్నది..

నన్ను విలన్‌గా చూస్తున్నది..

శేఖర్‌ను మాస్టర్ చేసింది నేనే. కానీ కొన్ని కారణాల వలన మా మధ్య చాలా విభేదాలు చోటుచేసుకొన్నాయి. వాటిని నేను చెప్పలేను. గురువును వదిలేసి చాలా దూరంగా వెళ్లాడు. అతడిని వెతుక్కొంటూ నేను వెళ్లాను. శేఖర్ భార్య కూడా ప్రస్తుతం నన్ను విలన్‌గా చూస్తున్నారు. అందుకే నేను చనిపోయినా నా శవాన్ని శేఖర్ తాకకూడదు.

కృష్ణవంశీది వెధవ బుద్ది

కృష్ణవంశీది వెధవ బుద్ది

కృష్ణవంశీ నాకు తెలుసు అని ఫీలవుతాడు. ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు అనే వెధవ బుద్ధి ఉంది. చక్రం సినిమాకు నన్ను కోరియోగ్రఫీ చేయమన్నాడు. అతడి ప్రవర్తన బాగుండదు. చేతిలో సిగరెట్ పట్టుకొని నీకు డ్యాన్స్ వచ్చా? అని ప్రశ్నించాడు. ఆయన కొన్ని సీన్లు చేసుకుంటే నేను పక్కన కూర్చున్నాను. అయితే నన్ను చూసి కూర్చోని ఏమి చేస్తున్నాడు అని అన్నారు. దాంతో మా మధ్య చెడింది.

వర్మ అంటే ఇష్టమే.. కానీ.

వర్మ అంటే ఇష్టమే.. కానీ.

సర్కార్ సినిమా నుంచి రాంగోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. 5డీ కెమెరాలతో సినిమాను నాశనం చేస్తున్నాడని ఒక వ్యక్తి ఆయనను తిడితే నేను ఒప్పుకోలేదు. కానీ అతడిని కలిసిన తర్వాత వర్మ వెధవ.. అతను ఓ శాడిస్టు అని తెలిసింది. ఏ సమయానికి వర్మ ఎలా ఉంటాడో ఆయన అసిస్టెంట్లకే తెలియదు.

వర్మ పుట్టడమే వేస్ట్

వర్మ పుట్టడమే వేస్ట్

గుడ్ మార్నింగ్, నమస్తే పెట్టిన నచ్చదు వర్మకు. టైం వేస్ట్ అని భావించే వ్యక్తి పుట్టడమే వేస్ట్. రౌడీ సినిమా షూటింగ్‌లో రక్తానికి రక్తం అనే పాట విషయంలో అమ్మాయిలను పక్కన పెట్టుకొని చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. దాంతో ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను.

పిల్లలకు సెక్స్ నేర్పిస్తారా?

పిల్లలకు సెక్స్ నేర్పిస్తారా?

గాడ్, సెక్స్, అండ్ ట్రూత్ (జీఎస్టీ) తీసిన రాంగోపాల్ వర్మపై మండిపడ్డారు. ఆయన వల్ల నా పిల్లల విషయంలో జాగ్రత్త పడుతున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఇంటర్నెట్ చూస్తే జీఎస్టీ బూతు సినిమా కనబడుతున్నది. పిల్లలకు సెక్స్ నేర్పించడం సరైంది కాదు.

తల్లిని, కూతుర్ని అలా చూపిస్తాడా?

తల్లిని, కూతుర్ని అలా చూపిస్తాడా?

సంప్రదాయ దేశంలో తన తల్లిని వర్మ అలా చూపిస్తాడా? ఏదో సమయంలో భర్తతో కలిసి వర్మ కూతురు బయటకు వస్తే.. నీ తండ్రి మియా మాల్కోవాను అలా చూపించాడు. నిన్ను కూడా చూపించాలా అని ఎవడైనా అంటే ఏమిటి పరిస్థితి. జీఎస్టీ లాంటి సినిమా తీయడం చాలా తప్పు.

వర్మను చెప్పుతో కొడుతారు..

వర్మను చెప్పుతో కొడుతారు..

ఇంకా హిందూ సంప్రదాయం చచ్చిపోలేదు. మన సంప్రదాయన్ని మంట గలుపుతున్నాడు. జీఎస్టీ ద్వారా సెక్స్ బహిరంగం చేసిన వర్మను చెప్పుతో కొడుతారు. బట్టలు ఊడదీసి ఎక్కడో వర్మ కొట్టడం ఖాయం. సర్కార్ లాంటి గొప్ప సినిమాను తీసిన నీవు తప్పదారి పడుతున్నావు.

వర్మకు గుణపాఠం తప్పదు

వర్మకు గుణపాఠం తప్పదు

నా ఇష్టం వచ్చినట్టు తీస్తాను అంటే కుదరదు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జీఎస్టీ లాంటి బూతు సినిమాను తీస్తే గవర్నమెంట్ నిఘా ఉంటుంది. ఇలాంటి సినిమాను తీసిన వర్మకు తగిన గుణపాఠం చెబుతారు. పెళ్లి కాకముందే వాడు అన్ని నేర్చుకోవాలంటున్నాడు వాడు అని వర్మపై ధ్వజమెత్తాడు.

వర్మను బట్టలూడదీసి కొట్టాలి

వర్మను బట్టలూడదీసి కొట్టాలి

జీఎస్టీ తీసిన మహిళలందరూ పక్కాగా ప్లాన్ చేసి ఎక్కడ ఉంటాడో అని తెలుసుకోవాలి. కారులో వెళితే వాడిని (వర్మ) నడిరోడ్డు మీద దించి బట్టలూడదీసి కొట్టాలి. ఇదంతా జీఎస్టీ పార్ట్2కు ముందే జరిగాలి. మహిళ కార్యకర్తలకు నేను కోరుతున్నాను.

వర్మ పిచ్చికుక్కలా

వర్మ పిచ్చికుక్కలా

తన తల్లితో కలిసి జీఎస్టీ చూశానని చెప్పుతున్న వర్మకు కుక్కకు ఉన్న విశ్వాసం లేదు. జీఎస్టీ లాంటి చిత్రాలు వస్తే మహిళలపై యువకుల దృక్పథం మారుతుంది. కాబట్టి మహిళలు మేల్కొనాలి. వాడి (వర్మ)ని ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదు. వాడిని వదిలేస్తే పిచ్చికుక్కలా మారుతాడు. పిచ్చిపట్టిన వర్మకు గుండు కొట్టించి, గాడిద మీద మహిళలు ఊరేగించాలి. అప్పుడు మరొకడు ఇలాంటి చేష్టలు చేయకుండా ఉంటారు.

వర్మను గుండుకొట్టించి

వర్మను గుండుకొట్టించి

మహిళలను కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ ప్రవర్తిస్తున్నాడు. ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కుతున్నాడు. జీఎస్టీ2 రాకముందే మహిళలు మేల్కొని బడితే పూజ చేయాలి. అప్పుడే దర్శకులు హద్దులో ఉంటారు. వర్మకు గుండు కొట్టిస్తే చూడాలని ఉంది అని రాకేష్ మాస్టర్ అన్నారు. వర్మను నేను వాడు అనడంలో తప్పేమీ లేదు.

ప్రభాస్‌తో విభేదాలు లేవు

ప్రభాస్‌తో విభేదాలు లేవు

ప్రభాస్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. ప్రభాస్ నా బిడ్డలాంటి వాడు. ఓ సమయంలో నా ఇంటికి వచ్చి ప్రభాస్, ఇలియానా భోజనం చేశారు. నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను. నటించడం రాదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X