twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ లో దారుణం: డ్యాన్సర్‌పై గ్యాంగ్ రేప్

    By Srikanya
    |

    Dancer drugged, gang-raped in Hyderabad, put on Mumbai-bound bus
    ముంబయి: నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌కు వచ్చిన డ్యాన్సర్‌కు(26) మత్తు మందిచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నలుగురు వ్యక్తులు తనకు మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం తనవద్ద ఉన్న నగదు, నగలు దోచుకుని ముంబయికి వచ్చే బస్సు ఎక్కించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.

    ఈనెల రెండో తేదీన వర్సోవా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చివరకు ఒక ప్రభుత్వేతర సంస్థ జోక్యంతో మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నీలిచిత్రాలు రూపొందించే ముఠా ప్రమేయం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌ను విచారించారు.

    నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో డ్యాన్స్‌ చేసేందుకు రూ.లక్ష చెల్లిస్తామని నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమం కోసం బాధితురాలు డిసెంబరు 31న హైదరాబాద్‌కు విమానంలో చేరుకోగా ఈవెంట్‌ నిర్వాహకులు నలుగురు ఆమెను కలుసుకున్నారు. విమానాశ్రయం నుంచి సుమారు అరగంట ప్రయాణం తర్వాత హోటల్‌కు తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు డ్యాన్స్‌ ఉంటుందని, అంతవరకూ విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఏదో శీతల పానీయం ఇచ్చారు.

    స్పృహలోకి రాగా బోరివలికి వచ్చే లగ్జరీ బస్సులో ఉన్నానని బాధితురాలు పేర్కొన్నారు. అంథేరీలో బస్సు దిగి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని, రెండు రోజులు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వేతర సంస్థ జనశక్తి ఫౌండేషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

    నిందితులు తన డెబిట్‌ కార్డులు, ఆభరణాలు, సెల్‌ఫోన్‌, రూ.17,000 నగదు అపహరించినట్లు ఆరోపించారు. ముంబయికి బస్సు టిక్కెట్‌ను ఇస్మాయిల్‌ షేక్‌ అనే వ్యక్తి బుక్‌ చేశాడని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. శంషాబాద్‌ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో జరిగిన కొత్త ఏడాది పార్టీల వివరాలను సేకరిస్తున్నారు

    English summary
    A 26-year-old Versova-based stage dancer has lodged a police complaint in Mumbai, alleging she was drugged and gangraped in Hyderabad where she had gone for a performance on the New Year eve. The woman claimed she woke up in a luxury bus, wearing her clothes inside out and with a ticket in a coat pocket that didn't belong to her. She also claimed she visited Versova police station in the same state on January 2, but police refused to register a complaint citing jurisdiction issues and asked her to lodge the case in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X