ఆ భయంకరమైన సినిమా మళ్ళీ వస్తోంది: జూలై 14 న విడుదల

'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'దండుపాళ్యం-2 చిత్రాన్ని జూలై 14న తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే.'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది.

తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

dandupalya 2 Release on july 14

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రాన్ని జూలై 14న తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. రియల్‌ ఇన్సిడెంట్స్‌తో ఎంతో నేచురల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దండుపాళ్యం చిత్రాన్ని మించి 'దండుపాళ్యం2' సూపర్‌హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ మాకు వుంది'' అన్నారు.

dandupalya 2 Release on july 14

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X