కిరాకత గ్యాంగ్ కథ ‘దండుపాళ్యం’

By Bojja Kumar

హైదరాబాద్ : కన్నడలో మంచి విజయం సాధించిన 'దండు పాళ్యం' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. పూజా గాంధీ, రవిశంకర్, మకరంద్, నిషా కొఠారి తదితరులు నటించిన ఈచిత్రానికి శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. నిర్మాత వెంకట్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుక శనివారం ఫిలించాంబర్ లో జరిగింది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై సీడీని ఆవిష్కరించగా...దర్శకురాలు బి.జయ తొలి సీడీని అందుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈచిత్రం వెబ్ సైట్ ప్రారంభించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ...అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం ఒకతను 80 మందిని మర్డర్ చేస్తాడు. దండుపాళ్యం గ్యాంగ్ గురించి ఓ జర్నలిస్టు రాసిన ఆర్టికల్ ఈ చిత్రానికి బేస్. తెలుగులోనూ ఈచిత్రం హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈచిత్రానికి పాటలు : భువన చంద్ర, సంగీతం : అర్జున్ జన్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X