twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "దండుపాళ్యం" దారుణాలు మళ్ళీ ఒకసారి... ఈ ఫొటోలే ఘోరంగా ఉన్నాయి

    పోయిన సంవత్సరం ఆగస్టు లోనే వస్తుందనుకున్న దండుపాళ్యం 2 సినిమా కొన్ని కారణాలవల్ల విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు త్వరలోనే మన ముందుకు రానుందట.

    |

    పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వెంకట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన దండుపాళ్యం. అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని సాధిచింది. ఈ చిత్రం తెలుగులో 10 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు శతదినోత్సవం కూడా జరుపుకొని సం చలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాష ల్లో ఇంతటి ఘన విజయం సాధించిన "దండుపాళ్యం" లో అప్పుడు ఉన్న టీమ్‌తోనే ఈ చిత్రానికి సీ క్వెల్‌గా "దండుపాళ్యం 2" చిత్రాన్ని నిర్మాత వెంకట్ భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.విడుదలకు నోచుకోకుండా ఆగిన ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రానుందట. ఒక్క సారి మళ్ళీ ఆ సినిమా విశేషాలు ..

    దండు పాళ్యం 2

    దండు పాళ్యం 2

    ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. పోయిన సంవత్సరం ఆగస్టు లోనే వస్తుందనుకున్న ఈ సినిమా కొన్ని కారణాలవల్ల అలాగే ఉండిపోయింది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ "దండు పాళ్యం 2" చిత్రం కోసం బెంగుళూర్‌లో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకు చాలా పెద్ద హైలైట్‌గా నిలుస్తాయి.

    యథార్థ కథ

    యథార్థ కథ

    వరుస హత్యలు, మానభంగాలు, దోపిడీలతో బెంగళూరు, చిత్తూరు, వేలూరు నగరాల్ని వణికించిన దండుపాళ్య గ్యాంగ్‌కు సంబంధించిన యథార్థ కథతో ఈ సినిమా రూపొందింది.అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం ఒకతను 80 మందిని చంపేసిన కౄరమైన మనిషి ఈ గ్యంగ్ లో ఉంటాడు. ఈ పాత్ర చేసిన రఘు ముఖర్జీ నటన నిజమైన హంతకుడేనా అన్నంత సహజంగా ఉండి ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది.

    క్రైమ్‌ లో కూడా ఇంత పెద్ద స్పాన్‌ ఉంటుందా

    క్రైమ్‌ లో కూడా ఇంత పెద్ద స్పాన్‌ ఉంటుందా

    ''దండుపాళ్యం" సక్సెస్‌ తర్వాత దీనికి సీక్వెల్‌గా సినిమా చెయ్యాలన్న ఆలోచన వున్నప్పటికీ వెంటనే చెయ్యలేకపోయాను. ఆ సినిమా కోసం నేను వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్‌ లో కూడా ఇంత పెద్ద స్పాన్‌ ఉంటుందా అనిపించింది. ఫస్ట్‌ పార్ట్‌ వెనుక ఉన్న కథను ఈ చిత్రంలో చూపిస్తున్నాం.

    ముగ్గురి కోణంలో

    ముగ్గురి కోణంలో

    ఒక విషయంపై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా రన్‌ అవుతుంది. సాధారణంగా ఒకరు ఒక మంచి పనిచేస్తే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తాం, చెబుతాం. అలాగే ఏదైనా క్రైమ్‌ జరిగినపుడు కూడా మీడియా దాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది.

    నిజాన్ని వున్నది వున్నట్టుగా

    నిజాన్ని వున్నది వున్నట్టుగా

    ప్రజలు కూడా దాని గురించి ఎక్కువ డిస్కస్‌ చేస్తారు. ఈ చిత్రంలో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. నిజానికి నేను ఈ స్టోరీని హేట్‌ చేస్తున్నాను. అయినప్పటికీ క్రైమ్‌ను డైలూష్యన్‌ వేలో చూపిస్తున్నాను. సినిమాలో ఎలాంటి మెసేజ్‌ ఉండదు" అంటూ దర్శకుడు చెప్పిన మాటలు అప్పట్లో ఈ సినిమా మీద మంచి అంచనాలనే క్రియేట్ చేసాయి.

    వయొలెన్స్ శృతి మించింది

    వయొలెన్స్ శృతి మించింది

    దండుపాళ్యం చిత్రంలో వయొలెన్స్ శృతి మించిందని.. ఇంటిమేట్ సన్నివేశాలను మరీ క్రూరంగా తీశారని.. హీరోయిన్ పూజా గాంధీని టాప్ లెస్ గా చూపించారని.. ఇలా ఎన్ని రకాల వివాదాలు ఉన్నా.. సినిమా మాత్రం సూపర్బ్ గా ఆడేసింది. పూజా గాంధీ సారధ్యంలో 9 మంది విలన్ గ్యాంగ్ అకృత్యాలు.. కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ గా బొమ్మాళి రవి శంకర్ లు నటన అందరినీ అలరించాయి. బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.

    తొలి భాగానికి మించి

    తొలి భాగానికి మించి

    తొలి భాగానికి మించి దండుపాళ్యం2 ఉంటుందని అంటున్నాడు నిర్మాత వెంకట్. దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంటుందని.. అందరినీ మెప్పిస్తుందని చెబుతున్నాడు. కొద్దిరోజుల్లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. తెలుగు కన్నడ భాషల్లో ఒకే సమయంలో రిలీజ్ కానున్న దండుపాళ్యం2 ఈసారైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి అడుగుపెడుతుందా లేదా అన్నది చూడాలి మరి....

    English summary
    "Dandupalyam 2" planning to release this movie in the month of August 2016 and it is completed shooting work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X