For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ దారుణమైన ట్రైలర్ చూసారా ?? ఒళ్ళు జలదరించేలా దండుపాళ్యం 2 ట్రైలర్

  |

  పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వెంకట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన దండుపాళ్యం. అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని సాధిచింది. ఈ చిత్రం తెలుగులో 10 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు శతదినోత్సవం కూడా జరుపుకొని సం చలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాష ల్లో ఇంతటి ఘన విజయం సాధించిన "దండుపాళ్యం" లో అప్పుడు ఉన్న టీమ్‌తోనే ఈ చిత్రానికి సీ క్వెల్‌గా "దండుపాళ్యం 2" చిత్రాన్ని నిర్మాత వెంకట్ భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.విడుదలకు నోచుకోకుండా ఆగిన ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రానుంది.

  క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ

  క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ

  వరుస హత్యలు, మానభంగాలు, దోపిడీలతో బెంగళూరు, చిత్తూరు, వేలూరు నగరాల్ని వణికించిన దండుపాళ్య గ్యాంగ్‌కు సంబంధించిన యథార్థ కథతో ఈ సినిమా రూపొందింది.అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం 80 మందిని చంపేసిన కౄరమైన మనిషి ఈ గ్యంగ్ లో ఉంటాడు. ఈ పాత్ర చేసిన రఘు ముఖర్జీ నటన నిజమైన హంతకుడేనా అన్నంత సహజంగా ఉండి ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది.

  ముగ్గురి కోణంలో సినిమా

  ముగ్గురి కోణంలో సినిమా

  ఒక విషయంపై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా రన్‌ అవుతుంది. సాధారణంగా ఒకరు ఒక మంచి పనిచేస్తే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తాం, చెబుతాం. అలాగే ఏదైనా క్రైమ్‌ జరిగినపుడు కూడా మీడియా దాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది.

  నిజాన్ని వున్నది వున్నట్టుగా

  నిజాన్ని వున్నది వున్నట్టుగా

  ప్రజలు కూడా దాని గురించి ఎక్కువ డిస్కస్‌ చేస్తారు. ఈ చిత్రంలో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. నిజానికి నేను ఈ స్టోరీని హేట్‌ చేస్తున్నాను. అయినప్పటికీ క్రైమ్‌ను డైలూష్యన్‌ వేలో చూపిస్తున్నాను. సినిమాలో ఎలాంటి మెసేజ్‌ ఉండదు" అంటూ దర్శకుడు చెప్పిన మాటలు అప్పట్లో ఈ సినిమా మీద మంచి అంచనాలనే క్రియేట్ చేసాయి.

  ‘దండుపాళ్యం 2' ట్రైలర్‌ రిలీజ్‌

  ‘దండుపాళ్యం 2' ట్రైలర్‌ రిలీజ్‌

  మూడేళ్ల కిందట విడుదల ఘన విజయం సాధించిన ‘దండుపాళ్యం'కు ఇది కొనసాగింపు చిత్రం. శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్‌ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘దండుపాళ్యం 2' ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ హోటళ్లో జరిగింది.

  బాగా పేరు తీసుకొచ్చింది.

  బాగా పేరు తీసుకొచ్చింది.

  నిర్మాత వెంకట్‌ స్నేహితుడు వాసు ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం వెంకట్‌ మాట్లాడుతూ..."వాస్తవ సంఘటనలతో మేం నిర్మించిన ‘దండుపాళ్యం' సినిమా కన్నడ, తెలుగులో ఘన విజయాన్ని అందుకుంది. కమర్షియల్‌ సక్సెస్‌తో నాకు బాగా పేరు తీసుకొచ్చింది.

  దండుపాళ్యం-3

  దండుపాళ్యం-3

  ఆ ఉత్సాహంతో ‘దండుపాళ్యం 2′ నిర్మించాం. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావొచ్చాయి. జూన్ లో ‘దండుపాళ్యం-2' విడుదల చేసి రెండుమూడు వారాల తేడాతో ‘దండుపాళ్యం-3' విడుదల చేస్తాం'' అని నిర్మాత వెంకట్‌ చెప్పాడు.

  తొలి సినిమాకు ఐదు రెట్ల మించి

  తొలి సినిమాకు ఐదు రెట్ల మించి

  కన్నడలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక్కడా అదే పేరు తెచ్చుకుంటుంది. తొలి సినిమాకు ఐదు రెట్ల మించి ఈ సినిమా ఉంటుంది. నటీనటులు అద్భుతంగా నటించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.' అన్నారు.

  సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌

  సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌

  దర్శకుడు మాట్లాడుతూ ‘‘దండుపాళ్యం-1 కి పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. జనాలు ఎక్స్‌పెక్ట్‌ చేసింది ఏదీ ఇందులో ఉండదు. కంప్లీట్‌ ‘యు' టర్న్‌లా సినిమా ఉంటుంది. సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ప్రారంభమైన ఈ చిత్రం చివరి వరకూ అదే ఉత్కంఠతో ఉంటుంది. వయలెన్స లేకుండా హానెస్ట్‌గా సినిమా తీశా'' అని అన్నారు.

  99.9 శాతం వద్దన్నారు

  99.9 శాతం వద్దన్నారు

  పూజా గాంధీ మాట్లాడుతూ ‘‘ముంగారుమలై'(తెలుగులో ఎమ్మెస్ రాజు చేసిన వాన) సినిమా చేసిన నేను ‘దండుపాళ్యం' సినిమా చేస్తానంటే 99.9 శాతం వద్దన్నారు. కథ కొత్తగా అనిపించడంతో అంగీకరించా. సినిమా విడుదలకు ముందు కర్ణాటకలో చాలా వివాదాలు జరిగాయి.

  లక్ష్మీ పాత్ర సవాల్‌గా అనిపించింది

  విడుదలయ్యాక ప్రశంసల వర్షం కురిపించారు. లక్ష్మీ పాత్ర సవాల్‌గా అనిపించింది. గుర్తుండిపోయే పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ఒక చాలెంజ్ గా తీసుకొని చేసిన పాత్ర జనానికి నచ్చటం మాత్రమే కాదు ఆత్మ తృప్తిని కూడా ఇస్తుంది.. మొదటి సినిమా కంటే రెండో సినిమానే బావుంటుంది'' అని అన్నారు.

  English summary
  "Dandupalyam 2" planning to release this movie in the month of june and it is completed shooting work. on 29tn may The Team released Trailer of Dandupalyam 2 telugu version in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X