twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దండుపాళ్యం 3'.... మరింత భయానకంగా, కిరాతకంగా! (మోషన్ పోస్టర్)

    దండుపాళ్యం 3 మోషన్ పోస్టర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    By Bojja Kumar
    |

    బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన 'దండుపాళ్యం2' కూడా రెండు భాషల్లోనూ విడుదలైంది.

    'దండుపాళ్యం' సీక్వెల్స్‌లో భాగంగా ఇప్పుడు 'దండుపాళ్యం 3' రాబోతోంది. ఆర్‌4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజని తాళ్ళూరి నిర్మిస్తున్న 'దండుపాళ్యం3' షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

    మోషన్ పోస్టర్

    'దండుపాళ్యం 3' చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. మోషన్ పోస్టర్ చేస్తుంటే సినిమా గతంలో వచ్చిన రెండు పార్టుల కంటే మరింత భయానకంగా, కిరాకతకంగా ఉండబోతోందని తెలుస్తోంది.

    ఇదే చివరి పార్టు?

    ఇదే చివరి పార్టు?

    దండుపాళ్యం సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు సిరీస్ లు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో వచ్చే చివరి మూవీ ఇదే అని తెలుస్తోంది.

    త్వరలో...

    త్వరలో...

    అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: రవిచంద్రన్‌, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

    దండుపాళ్యం

    దండుపాళ్యం

    రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'దండుపాళ్యం' చిత్రం 2012లో విడుదలై భారీ విజయం సాధించింది. దండుపాళ్యం అనే ఊరికి చెందిన గ్యాంగ్ 80 హత్యలు, దోపిడీలు, మానభంగాల పర్వాన్ని అప్పట్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. దండుపాళ్యం గ్యాంగ్ పేరు చెబితేనే కర్నాటక వాసుల్లో ఏదో తెలియని భయం ఉండేది. ఆ గ్యాంగ్ అంత దారుణమైన ఘోరాలు చేశారుమరి.

    తొలిభాగం, రెండవ భాగంలో...

    తొలిభాగం, రెండవ భాగంలో...

    తొలి భాగంలో దండుపాళ్యం ముఠా సభ్యులు పోలీసులకు పట్టుబడటం, వారికి కోర్టు ఉరిశిక్ష విధించడం వరకు చూపించారు. తర్వాత వచ్చిన 'దండుపాళ్యం-2'ను అసంపూర్తిగా ముగించారు. ఇప్పటికే వచ్చిన పార్ట్-1..... త్వరలో రాబోతున్న పార్ట్-3కి మధ్య ఓ చిన్న లింకులా చాలా సాదా సీదాగా దండుపాళ్యం 2 ఉంది. త్వరలో రాబోయే మూడో భాగం ఆసక్తిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Dandupalyam 3 Motion Poster released. Dandupalya 3 starring Pooja Gandhi and Raghu Mukherjee in the leading roles. The plot is based on the real-life exploits of a notorious gang named 'Dandupalya'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X